వరుస సక్సెస్ ల మీద ఉన్న కొరటాల శివ “ఆచార్య” కోసం సంవత్సరం వెయిట్ చేయటంతో పాటు రెండు సంవత్సరాలు షూటింగ్.., వచ్చిన నష్టం బట్టి కెరియర్ పరంగా మూడు సంవత్సరాలు లాస్ అని తేలింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని దర్శకుడుగా దూసుకుపోయారు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను ఈ నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు దక్కించుకుని తెలుగులోని స్టార్ డైరెక్టర్ గా నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని దెబ్బ తగిలింది. కొరటాల “ఆచార్య”తో ఫస్ట్ టైం అట్టర్ ఫ్లాప్ సొంతం చేసుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అల్లరించలేకపోయింది. ఈ సినిమా కొన్న ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టలు చూడడం జరిగింది.
“ఆచార్య” నిర్మాణ భాగస్వామ్యంలో కొరటాల స్నేహితులు ఉండటంతో… కొన్ని ప్రాంతాలకు సంబంధించి సినిమా రిలీజ్ అవ్వకుండానే భారీ ధరకు కొరటాల సినిమా హక్కులు అమ్మడం జరిగిందట. అయితే “ఆచార్య” మినిమం కలెక్షన్ లు కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు నుంచి కొరటాలకు ప్రెజర్ ఎక్కువైంది. కొరటాల ఆఫీస్ వద్ద ధర్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో కొరటాల సన్నిహితులు సినిమా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో వాళ్ళందరికీ సర్దుబాటు చేయాల్సిన బాధ్యత పడింది. దాంతో అందరితో మాట్లాడి క్లియర్ చేస్తూ వచ్చారట.
చివరకు సీడెడ్ లో 5 కోట్లు ఫైనల్ సెటిల్మెంట్ చేసి కొరటాల బయిటపడ్డారట. దాంతో ఇప్పుడు పూర్తి రిలీఫ్ వచ్చిందంటున్నారు. ఏది ఏమైనా వరుస సక్సెస్ ల మీద ఉన్న కొరటాల శివ “ఆచార్య” కోసం సంవత్సరం వెయిట్ చేయటంతో పాటు రెండు సంవత్సరాలు షూటింగ్.., వచ్చిన నష్టం బట్టి కెరియర్ పరంగా మూడు సంవత్సరాలు లాస్ అని తేలింది. పైగా సంపాదించుకున్నది వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాపై ఆయన పూర్తి దృష్టి పెట్టారు.