పవన్ కళ్యాణ్ పై రాజశేఖర్ సెటైర్లు.. గబ్బర్ సింగ్ కు కౌంటరా!

Published : May 11, 2019, 09:24 AM IST
పవన్ కళ్యాణ్ పై రాజశేఖర్ సెటైర్లు.. గబ్బర్ సింగ్ కు కౌంటరా!

సారాంశం

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ లో గరుడ వేగ చిత్రం తర్వాత జోష్ పెరిగింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ కు గరుడ వేగ రూపంలో ఓ హిట్ దక్కింది. అదే ఉత్సాహంతో రాజశేఖర్ తన కొత్త చిత్రం కల్కిని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ లో గరుడ వేగ చిత్రం తర్వాత జోష్ పెరిగింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ కు గరుడ వేగ రూపంలో ఓ హిట్ దక్కింది. అదే ఉత్సాహంతో రాజశేఖర్ తన కొత్త చిత్రం కల్కిని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కల్కి టీజర్ కు విశేషమైన స్పందిన వస్తోంది. 

కల్కి చిత్రంతో రాజశేఖర్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ ని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కల్కి ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసినట్లుగా అనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ చూసిన వారికి ఈ సందేహం కలగక మానదు. గబ్బర్ సింగ్ చిత్రంలో రాజశేఖర్ ని ఇమిటేట్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. ఓ జూనియర్ ఆర్టిస్ట్ గబ్బర్ సింగ్ చిత్రంలో రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తాడు. 

కల్కి చిత్రం ద్వారా రాజశేఖర్ గబ్బర్ సింగ్ చిత్రంపై కౌంటర్ వేశారని అంటున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే గబ్బర్ సింగ్ లో నటించిన జూనియర్ ఆర్టిస్టే కల్కిలో కూడా నటించాడు. ఇది నిజంగా పవన్ పై సెటైరేనా లేక సరదాకే ఆ సన్నివేశం పెట్టారా అనేది తేలాలంటే రాజశేఖర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్