మెగా ఫ్యాన్స్ కి రంజాన్‌ సర్‌ప్రైజ్‌.. `గాడ్‌ ఫాదర్‌` కోసం ప్రభుదేవా.. ఆటం బాంబ్‌ లాంటి సాంగ్‌..

Published : May 03, 2022, 04:36 PM IST
మెగా ఫ్యాన్స్ కి రంజాన్‌ సర్‌ప్రైజ్‌.. `గాడ్‌ ఫాదర్‌` కోసం ప్రభుదేవా.. ఆటం బాంబ్‌ లాంటి సాంగ్‌..

సారాంశం

`గాడ్‌ ఫాదర్‌` చిత్రానికి ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా చేస్తుండటం విశేషం. చిరంజీవితో ఓ ఆటం బాంబ్‌ లాంటి పాటని కంపోజ్‌ చేయబోతున్నారట ప్రభుదేవా. 

మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది `గాడ్‌ ఫాదర్‌`(God Father) టీమ్‌. రంజాన్‌ పండుగ సందర్భంగా మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ చిత్రానికి ప్రభుదేవా(Prabhudeva) కొరియోగ్రాఫర్‌గా చేస్తుండటం విశేషం. చిరంజీవి(Chiranjeevi)తో ఓ ఆటం బాంబ్‌ లాంటి పాటని కంపోజ్‌ చేయబోతున్నారట ప్రభుదేవా. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్‌ వెల్లడించారు. ట్విట్టర్‌లో చెబుతూ, ఇందులో సల్మాన్‌ ఖాన్‌ కూడా పాల్గొనబోతున్నారట. చిరంజీవి, సల్మాన్‌ కాంబినేషన్‌లో ఈ పాట సాగుతుందని, ప్రభుదేవా మార్క్ స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయని, థియేటర్లో ఆటం బాంబ్‌లా పేలబోతున్నాయని చెప్పారు థమన్‌. 

మోహన్‌ రాజా దర్శకత్వంలో `గాడ్‌ ఫాదర్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ ఏడాదిలోనే తెరపైకి రాబోతుందని సమాచారం. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నయనతార మరో ముఖ్య పాత్రధారి. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `లూసీఫర్‌` చిత్రానికిది రీమేక్‌. అందులో పృథ్వీరాజ్‌ పాత్రని సల్మాన్‌ చేస్తున్నారు. వివేక్‌ ఒబేరాయ్‌ పాత్రని సత్యదేవ్‌ చేయబోతున్నట్టు టాక్‌. చిరంజీవికి ఇందులో హీరోయిన్‌ లేదు. అందుకోసం ఓ ఐటెమ్‌ నెంబర్‌ని ప్లాన్‌ చేసినట్టు టాక్‌. ప్రభుదేవాతో ఇప్పటికే `శంకర్‌ దాదా జిందాబాద్‌` వంటి చిత్రాలకు చిరంజీవితో పనిచేశారు. చాలా గ్యాప్‌తో మరోసారి కొలాబరేట్‌ కాబోతున్నారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ఇటీవల నటించిన `ఆచార్య` చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదలైంది. మొదటి షో నుంచే డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీన్నుంచి బయటపడేందుకు చిరంజీవి వెకేషన్‌ ప్లాన్‌ చేశారు. తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి అమెరికా, యూరప్‌ టూర్‌కి వెళ్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. 

`కరోనా తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా` అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. `ఎంజాయ్‌ మమ్మి అండ్‌ డాడీ, ఐలవ్‌ యూ సో మచ్‌` అని శ్రీజ, `హ్యాపీ టైమ్ అత్త‌య్య‌, మామ‌య్య` అని ఉపాసన కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌`తోపాటు `భోళా శంకర్‌`, బాబీతో `మెగా154` చిత్రాల్లో నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా