కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) ‘వేద’ చిత్రం రిలీజ్ సందర్భంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) యూనిట్ కు విషెస్ తెలిపారు. తిరిగి యూనిట్ డార్లింగ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
కన్నడ యాక్షన్ డ్రామాగా గతేడాది డిసెంబర్ 23న విడుదలైన చిత్రం ‘వేద’ (Vedha).కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఏ. హర్ష రచన, దర్శకత్వంలో తెరకెక్కింది. జీ స్టూడియోస్‌తో కలిసి గీతా పిక్చర్స్ బ్యానర్‌పై గీతా శివరాజ్‌కుమార్ నిర్మించారు. ఇది శివరాజ్ కుమార్ 125 చిత్రం.. పైగా అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్‌లో నిర్మించడంతో ఆయనకు ప్రత్యేకమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ లోనూ విడుదలకు సిద్ధం అవుతోంది.
కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అలానే మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రాన్ని ఫిబ్రవరి 9న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. మొన్న విడుదలైన చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉందని అభినందించారు. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న డార్లింగ్ కు చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
వారంతో రోజుల్లో తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుందీ చిత్రం. ఈ సందర్భంగా జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాములుగా ఇండస్ట్రీలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, మోషన్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. చిత్రంలో శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ, తదితరులు ఆయా కీలక పాత్రల్లో నటించారు.
Thank you Darling Garu for your support and love for 's
In Theathers from Feb 9th !
🌟ing:
🎬:
💰:'s Under
🎥:
✂️:
🎼:
📣: pic.twitter.com/TRKQTyD6EE