ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమే..!

Published : Aug 19, 2019, 11:18 AM ISTUpdated : Aug 19, 2019, 12:05 PM IST
ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమే..!

సారాంశం

గతంలో తను ఇచ్చిన మాటను మరోసారి గుర్తుచేసుకున్నాడు ప్రభాస్. ఈసారి తప్పకుండా ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని చెబుతున్నాడు. కానీ ఈసారి కూడా ప్రభాస్ మాట మీద నిలబడతాడని అనుకోవడానికి ఛాన్స్ లేదు. 

ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని గతంలో చాలా సార్లు చెప్పాడు ప్రభాస్. కానీ 'బాహుబలి' సినిమా సమయంలో అలా చేయడం కుదరలేదు. 'సాహో' సినిమాకి ఏకంగా రెండేళ్ల సమయం తీసుకున్నాడు. అందుకే గతంలో తను ఇచ్చిన మాటను మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఈసారి తప్పకుండా ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని చెబుతున్నాడు. కానీ 
ఈసారి కూడా ప్రభాస్ మాట మీద నిలబడతాడని అనుకోవడానికి ఛాన్స్ లేదు.

ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకున్నా..   ఇండస్ట్రీ మాత్రం అతడిని అలా చూడడం లేదు. బాహుబలి తర్వాత ఏడాదికి రెండు సినిమాలంటూ అభిమానులకు మాటిచ్చానని, అయితే మాటతప్పాల్సి వచ్చిందని, ఇప్పుడు మాట ఇవ్వకుండానే ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటున్నారు ప్రభాస్.

అయితే దర్శకనిర్మాతలు మాత్రం దానికి ఒప్పుకోరు. ప్రభాస్ డేట్స్ దొరకడమంటే అంత సులువు కాదు.. దొరికిన కాల్షీట్స్ తో ప్రభాస్ తో చిన్న సినిమా ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఎవరూ అనుకోరు. ప్రభాస్ తో సినిమా తీసి తమ సత్తా చాటడానికి దర్శకుడు బాగా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రభాస్ గత సినిమాలతో పోలిక ఉంటుంది కాబట్టి రిస్క్ తీసుకోవాలని అనుకోరు.

ప్రభాస్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. వారందరికీ నచ్చే విధంగా సినిమా తీయాలి. అన్ని చోట్ల నుండి మంచి బిజినెస్ జరిగే విధంగా ఉండే సబ్జెక్ట్ డీల్ చేయాలి. వీటన్నింటినీ దాటుకొని వెళ్లాలంటే ఏడాదికి ఒక్క సినిమా చేసినా గొప్పనే చెప్పాలి. కాబట్టి ప్రభాస్ రెండు సినిమాల కాన్సెప్ట్ అనేది వర్కవుట్ అవ్వకపోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు.. హీరోకి తీవ్ర అవమానం, కానీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్
Ram Charan : చిరంజీవి కొడుకుగా పుట్టడం భారమా? రామ్ చరణ్ కీలక కామెంట్స్