సైరా టీజర్ ప్రోమో: పవర్ స్టార్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్

Published : Aug 19, 2019, 11:11 AM ISTUpdated : Aug 19, 2019, 11:12 AM IST
సైరా టీజర్ ప్రోమో: పవర్ స్టార్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి హిస్టారికల్ ఫిల్మ్ సైరా టీజర్ ఈ నెల 20న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  మెగాస్టార్ పుట్టినరోజుకి జరుపుకోబోయే రెండు రోజుల ముందే టీజర్ ని రిలీజ్ చేస్తుండడం విశేషం. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది.   

ఇక పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మేకింగ్ ప్రోమోను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అన్నయ్య చిరంజీవి పక్కనే ఉండి తమ్ముడికి వివరిస్తున్న తీరు ప్రోమోలో ఆకట్టుకుంటోంది. ఇక చివరగా పవర్ స్టార్ గూస్ బంప్స్ వచ్చేలా సైరా నరసింహా రెడ్డి అని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు - తమిళ్ - హింది - మలయాళం - కన్నడ భాషల్లో రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మెగాస్టార్ కెరీర్ లో మొదటిసారి అయిదు భాషల్లో విడుదలవుతున్న సినిమా ఇదే కావడం విశేషం. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమాను నిర్మిస్తుండగా అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - సుదీప్ - నయనతార వంటి స్టార్స్ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

రాజా సాబ్ గేమ్ ఓవర్.. 13వ రోజు ప్రభాస్ సినిమా షాకింగ్ వసూళ్లు
నాగార్జున యాక్టింగ్ పై సెటైర్లు వేసిన ఏఎన్నార్.. తండ్రే తనపై జోకులు వేయడంతో ఏం చేశాడో తెలుసా ?