Prabhas : సందీప్ రెడ్డి వంగ బర్త్ డే.. టార్గెట్ ఫిక్స్ చేస్తూ విష్ చేసిన ప్రభాస్.! రిప్లై ఏంటో తెలుసా?

Published : Dec 25, 2023, 03:45 PM ISTUpdated : Dec 25, 2023, 03:47 PM IST
Prabhas :  సందీప్ రెడ్డి వంగ బర్త్ డే.. టార్గెట్ ఫిక్స్ చేస్తూ విష్ చేసిన ప్రభాస్.! రిప్లై ఏంటో తెలుసా?

సారాంశం

డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ Sandeep Reddy Vangaకు ప్రభాస్ Prabhas పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డార్లింగ్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, రీసెంట్ గా ‘యానిమల్’ Animalతో డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. తెలుగు హీరో బాలీవుడ్ లో సత్తా చాటడం ఆసక్తికరంగా మారడంతో పాటు సందీప్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పైనా హైప్ ను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ రోజు ప్రపంచమంతా క్రిస్టమస్ పండుగను (Merry Christmas 2023) సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే రోజు సందీప్ రెడ్డి వంగ (Sandeep Redd Vanga Birthday)  పుట్టిన రోజు కావడం విశేషం. 

వరంగల్ కు చెందిన సందీప్ రెడ్డి వంగ నేటితో 42వ ఏటా అడుగుపెట్టారు. రీసెంట్ గా యానిమల్ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ కు అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆసక్తికరంగా కామెంట్ చేశారు. ‘వచ్చే ఏడాది ఇంకా సాధించాలి సందీప్ రెడ్డి వంగ. అలాగే సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను’. అంటూ ఇన్ స్టా స్టోరీ హ్యాండిల్ ద్వారా విష్ చేశారు. దీంతో ‘స్పిరిట్’ గురించే కూడా డార్లింగ్ సందీప్ కు గుర్తు చేసినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీనికి సందీప్ రెడ్డి వంగా రిప్లై ‘థ్యాంక్యూ అన్న’ అంటూ సంబోధించడం వారి మధ్య బాండ్ ను తెలియజేస్తోంది. పైగా సందీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డార్లింగ్ తోనే అతి త్వరలోనే ఉండబోతుందనే ఆశలను రేకెత్తిస్తోంది. ఏదేమైనా డార్లింగ్ సందీప్ ను విష్ చేయడంతో ఎంతో ఖుషీ అయ్యారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద Salaarతో కాసుల వర్షం కురిపిస్తున్నారు.  ఇక నెక్ట్స్ సందీప్ రెడ్డితో స్పిరిట్ Spiritలో నటించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Niharika: చిరంజీవి డ్రీమ్ ని ఫుల్‌ ఫిల్‌ చేసిన నిహారికా.. ఏం చేసిందంటే
400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే