Salaar: సలార్ పై రాజమౌళి రివ్యూ ఇంకా రాలేదేంటి ?

Published : Dec 25, 2023, 02:36 PM IST
Salaar: సలార్ పై రాజమౌళి రివ్యూ ఇంకా రాలేదేంటి ?

సారాంశం

ప్రశాంత్ నీల్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రభాస్ లని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కూడా రాజమౌళి జోస్యం చెప్పారు. అనుకున్నట్లే సలార్ సూపర్ హిట్ టాక్ తో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సలార్ సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే ప్రభాస్ అభిమానులు ఎంత ఆకలితో ఉన్నారో అర్థం అవుతుంది. మూడు రోజుల్లోనే సలార్ చిత్రం 300 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. ప్రభాస్ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో ప్రశాంత్ నీల్ అదే విధంగా ప్రభాస్ ని చూపించారు. 

యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ ఊచకోతలో అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. సలార్ చిత్రానికి పెద్దగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. బహుశా ప్రభాస్ కాలికి సర్జరీ కావడం వల్లే అనే ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ నార్త్ లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. సలార్ ప్రమోషన్స్ లో జక్కన్న రాజమౌళి భాగం అయిన సంగతి తెలిసిందే. 

ప్రశాంత్ నీల్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రభాస్ లని రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కూడా రాజమౌళి జోస్యం చెప్పారు. అనుకున్నట్లే సలార్ సూపర్ హిట్ టాక్ తో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా రిలీజై మూడు రోజులు గడుస్తున్నా ఇంతరవరకు జక్కన్న సలార్ చిత్రం గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఇది కాస్త ప్రభాస్ అభిమానులకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. రాజమౌళి, ప్రభాస్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

బాహుబలి తర్వాత ఒక్క హిట్ వస్తే దానిపై కూడా రాజమౌళి ఇంకా స్పందించకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు సైతం ఆల్రెడీ సలార్ చిత్రానికి రివ్యూ ఇచ్చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..