Prabhas : క్రిష్ణంరాజుకు ‘ప్రభాస్’బర్త్ డే విషేష్... రాధేశ్యామ్ నుంచి ‘పరమహంస’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 20, 2022, 02:04 PM ISTUpdated : Jan 20, 2022, 02:07 PM IST
Prabhas : క్రిష్ణంరాజుకు ‘ప్రభాస్’బర్త్ డే విషేష్... రాధేశ్యామ్ నుంచి ‘పరమహంస’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సారాంశం

రెబల్ స్టార్ క్రిష్ణంరాజు టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఏలిన విషయం తెలిసిందే.  అయితే క్రిష్ణం రాజు పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా  ప్రత్యేకంగా పుట్టిన రోజు  శుభాకాంక్షలు తెలిపారు.   

నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న క్రిష్ణం రాజు ‘ప్రభాస్’ను టాలీవుడ్ కు తీసుకొచ్చి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు ఎంతో కష్ట పడ్డారు.
మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎందరో దిగ్గజ నటులలో ఒకప్పటి డాషింగ్ హీరోలలో ఒకరైన రెబల్ స్టార్ కృష్ణం రాజు 82వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. 

ఈ సందర్భంగా  క్రిష్ణం రాజు సహకారంతో టాలీవుడ్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గా పరిచయమై పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా తన బెస్ట్ విషేస్ ను తెలియజేశారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాను ఏలుతున్న విషయం తెలిసిందే. 

అయినప్పటికీ మాత్రం తన పెదనాన్న పట్ల  ప్రభాస్  ఇప్పటికీ ఎంతో ప్రేమ చూపిస్తాడు. పలు మూవీ ఫంక్షన్లలోనూ ఈ విషయాన్ని తెలియజేశాడు ప్రభాస్.  ఆయన బర్త్ డే సందర్భంగా తాను కూడా తన సోషల్ మీడియాలో వెరీ స్పెషల్ విషెష్ ని తెలియజేశాడు. తన భారీ సినిమా రాధే శ్యామ్ నుంచి ఒక స్పెషల్ పోస్టర్ తో ‘మా అంకుల్ ది రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి బర్త్ డే విషెష్, మీ వివేకం, గైడెన్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపాడు. దీనితో రెబల్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

అదేవిధంగా ‘ర్యాదే శ్యామ్’ టీం కూడా క్రిష్ణం రాజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మున్ముందు ఆరోగ్యంగా ఉండాలని, ఈ ఏడాది మంచి జరగాలని ఆకాంక్షించారు. పలువురు సినీ పెద్దలు కూడా క్రిష్ణం రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా, ర్యాధే శ్యామ్ మూవీలో పరమహంస పాత్రలో కనిపించనున్న క్రిష్ణం రాజు పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. వయసు మీద పడుతున్నా తనకు నటనపై ఉన్న ఆసక్తి మూలంగా రిలీజైన్ పోస్టర్ లో కనిపిస్తున్న ‘పరమహంస’ పాత్రలోని క్రిష్ణం రాజు ఎంతో తేజస్సును కలిగి ఉన్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు