ప్రభాస్ 'మైత్రీ మూవీస్'కు హ్యాండ్,దిల్ రాజుకునో ..కారణం?

By Surya Prakash  |  First Published Dec 8, 2020, 12:19 PM IST

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ ని సెట్ చేసి సినిమా ప్లాన్ చేసింది మైత్రి మూవీస్ . అంతెందుకు మైత్రి మూవీస్ ప్రశాంత్ కి ఈ సినిమా కోసమే అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ప్రభాస్ ఎందుకో మైత్రిని ప్రక్కన పెట్టాడు.  నిర్మాత దిల్ రాజుకి సినిమా చేస్తానని మాటిచ్చాడు. ఆయన తన కాంపౌండ్ లోని దశరథ్, సురేంద్రరెడ్డి వంటి దర్శకులను పంపారు. వాటిల్లో ఏ స్క్రిప్ట్ కు ప్రభాస్ ఓకే చెప్పి పట్టాలు ఎక్కించలేదు. 
 


ప్రభాస్ కెరీర్ పూర్తిగా టాలీవుడ్ తో ముడిపడి ఉంది. ఆయన పునాదులు ఇక్కడే ఉన్నాయి. కానీ బాహుబలి వచ్చాక ఆయన స్దాయి మారిపోయింది. ప్రతీ సినిమాను బాహుబలి స్దాయిలో పాన్ ఇండియాగా మార్చాలనుకుంటున్నారు. అందుకు సిద్దం గా లేని నిర్మాతలు వాళ్లంతట వాళ్లే ప్రక్కకు తప్పుకుంటారు. కానీ మైత్రీ మూవీస్, దిల్ రాజు లాంటి నిర్మాతలు బ్యానర్స్ మాత్రం ఎంతైనా పెట్టడానికి సిద్దపడతారు. అయితే ప్రభాస్ వాళ్లకు కటీఫ్ చెప్తున్నాడు. అందుకు కారణం ఏమిటి అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మనం గమనిస్తే..ప్రభాస్ ఈ మధ్యన ప్రకటించిన,ఓకే చేసిన సినిమాలు దాదాపు వేరే భాషల నిర్మాతలవే.

 కేవలం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకే అశ్వనీదత్ నిర్మాత. ఇక హిందీ దర్శకుడు రూపొందిస్తున్న  ఆదిపురుష్ సినిమాకి ట్-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాత. “సాలార్” సినిమాకి కన్నడ కేజీఎఫ్ నిర్మాతలు. ఈ నేపధ్యంలో అశ్వనీదత్  కి తప్ప మరో తెలుగు నిర్మాతకి ప్రభాస్ ఓకే చెప్పటం లేదనేది ఖచ్చితంగా అందరూ మాట్లాడుకునే విషయమే 

Latest Videos

మొదట వాస్తవానికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ ని సెట్ చేసి సినిమా ప్లాన్ చేసింది మైత్రి మూవీస్ . అంతెందుకు మైత్రి మూవీస్ ప్రశాంత్ కి ఈ సినిమా కోసమే అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ప్రభాస్ ఎందుకో మైత్రిని ప్రక్కన పెట్టాడు.  నిర్మాత దిల్ రాజుకి సినిమా చేస్తానని మాటిచ్చాడు. ఆయన తన కాంపౌండ్ లోని దశరథ్, సురేంద్రరెడ్డి వంటి దర్శకులను పంపారు. వాటిల్లో ఏ స్క్రిప్ట్ కు ప్రభాస్ ఓకే చెప్పి పట్టాలు ఎక్కించలేదు. 

మరి ప్రభాస్ ఎందుకిలా చేస్తున్నారు అంటే ...మొదట దిల్ రాజు నుంచి ఆయనకు పాన్ ఇండియా సబ్జెక్ట్ ఏదీ రాలేదని తెలుస్తోంది. అదే సమయంలో తన రెమ్యునేషన్ 80 కోట్లు ఇవ్వటానికి వారెవ్వరూ ఉత్సాహం చూపించటం లేదు..తన సినిమా బడ్జెట్ 300 నుంచి 400 కోట్లు పెట్టడానికి ధైర్యం చేయటం లేదని సమాచారం. ఇవన్ని లెక్కేసుకున్న ప్రభాస్...తన పాన్ ఇండియా కెరీర్ కు తగినట్లు డెసిషన్స్ తీసుకుంటున్నారని అంటున్నారు. అందులో తప్పేమీ లేదు కూడా.                                                                                                                

click me!