మహేష్ హీరోయిన్ కు కరోనా

By Surya Prakash  |  First Published Dec 8, 2020, 9:06 AM IST

కృతిసనన్‌ తెలుగులో మహేశ్ సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాలో, ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి ‘దోచెయ్‌’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె  బాలీవుడ్‌కే పరిమితమైంది. అలాగే  ఈ భామ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్‌’లో సీతగా నటించనుందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి.  దీనిపై  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా....దేశంలో కరోనావైరస్  కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం ఆటాడుకుంటోంది . ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. నిన్నటికి నిన్న వరుణ్ ధావన్ కరోనా బారిన పడినట్లు ప్రకటించారు. అంతకుముందు అనీల్ కపూర్ సైతం తనకు కరోనా అని, విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటన చేసారు. తాజాగా బాలీవుడ్‌లో మరో కోవిడ్ పాజిటివ్‌ కేసు వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్‌ కృతి సనన్‌ కు కరోనా సోకినట్లు నిర్థారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

కృతి ప్రస్తుతం రాజ్‌కుమార్‌రావ్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది.  రీసెంట్ గా షూటింగ్‌ పూర్తి చేసుకొని చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతూ విమానంలో ఫ్యాన్స్ తో కలిసి ఒక ఫొటోను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.  అయితే ఆ పోస్టు తర్వాత నుంచి కృతి సనన్ మళ్లీ సోషల్‌ మీడియాలో కనిపించలేదు. తాజాగా ఆమె కరోనా బారిన పడినట్లు బాలీవుడ్ మీడియా అంటోంది.  అయితే తనకు కరోనా వచ్చనట్లు కృతి ప్రకటన చెయ్యలేదు.  

Latest Videos

click me!