బాహుబలితో వేరే సినిమాను పోల్చొద్దు-ప్రభాస్

Published : Sep 25, 2017, 01:46 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బాహుబలితో వేరే సినిమాను పోల్చొద్దు-ప్రభాస్

సారాంశం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి బాహుబలి సక్సెస్ తో హిందీలో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న టీమ్ ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో బాహుబలిని మరే సినిమాతో పోల్చొద్దన్న ప్రభాస్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ పరంగానూ రికార్డులు బద్దలు కొట్టింది. బాలీవుడ్‌లో భారీ బ్లాక్ బస్టర్స్‌కి వేటికి సొంతం కానీ రికార్డుల్ని సాధించి భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్రకి నాంది పలికింది బాహుబలి. సుమారు రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని అనుకునేలా చేసింది.

 

తెలుగు దర్శకుడి సత్తా ఏంటో బాలీవుడ్‌కి చాటిచెప్పిన రాజమౌళి ఈ సినిమాతో బాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, సత్యరాజ్, తమన్నా వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ టీవీల్లో ప్రసారం కానున్న నేపథ్యంలో బాహుబలి టీమ్ ఈరోజు కాసేపు నేషనల్ మీడియాతో ముచ్చటించింది.

 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రభాస్.. బాహుబలి సినిమాను మరే ఇతర సినిమాతో పోల్చిచూడలేం అని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా బాహుబలిని కాపీ కొట్టేవిధంగా మరే దర్శకుడు కూడా సినిమాలు తెరకెక్కించాలని ప్రయత్నించొద్దు అని ఇండియన్ ఫిలిం మేకర్స్‌కి విజ్ఞప్తి చేశాడు ప్రభాస్. మీ తర్వాతి సినిమా కూడా బాహుబలి లాంటిదేనా అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రభాస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాహుబలి చిత్రంపై ప్రభాస్ కున్న నిబద్ధత మరోసారి రుజువైంది.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు