ప్రమాదానికి గురైన సీనియర్ నటుడు కృష్ణంరాజు, అపోలో నందు చికిత్స!

Published : Sep 14, 2021, 12:16 PM ISTUpdated : Sep 14, 2021, 12:24 PM IST
ప్రమాదానికి గురైన సీనియర్ నటుడు కృష్ణంరాజు, అపోలో నందు చికిత్స!

సారాంశం

కృష్ణంరాజు తమ ఇంటిలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.  అయితే ఆయన కార్యాలయం వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. 


సీనియర్ నటుడు కృష్ణం రాజు ప్రమాదానికి గురయ్యారు. అయన కాలికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కృష్ణంరాజు తమ ఇంటిలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడినట్లు సమాచారం. దీనితో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. అపోలో వైద్యులు మంగళవారం ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆయన కార్యాలయం వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. కృష్ణంరాజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు, ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సాయి ధరమ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు గారు చెప్పారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనితో అసలు కారణం ఏమిటన్న సందిగ్దత కొనసాగుతుంది.

దాదాపు ఆరు దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన కృష్ణం రాజు వయసు రీత్యా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయన నట వారసుడు కాగా, రాధే శ్యామ్ మూవీలో సహనిర్మాతగా ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో ఆయన ఓ రోల్ చేసినట్లు సమాచారం. కృష్ణం రాజు ప్రస్తుత వయసు 81ఏళ్ళు కావడం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే