2021 లో ప్రభాస్ ..రెండు రిలీజ్ లు ప్లానింగ్

By Surya Prakash  |  First Published Dec 14, 2020, 12:57 PM IST

సూపర్ హిట్ ...బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాట ఇచ్చినా దాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు ప్ర‌భాస్. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వ‌ర‌స సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ వాటి విడుద‌ల తేదీల‌పై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. కానీ ఇప్పుడు రెండు సినిమాల‌పై ఒకేసారి క్లారిటీ వచ్చింది.

2013నుంచి ప్రభాస్..ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సినిమా చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. 2013లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మిర్చి, ఆ తర్వాత బాహుబలి 1 2015లో, రెండో పార్ట్ 2017లో ..ఆ తర్వాత 2019లో సాహో..ఇలా రిలీజ్ ల ప్రస్దానం సాగుతోంది. అయితే 2020లో ఒక్క సినిమా కూడా రిలీజ్ లేదు. 2021లో మాత్రం లెక్కలు మార్చి రెండు సినిమాలు రిలీజ్ చేయబోతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ కోసం తీస్తున్న సినిమాలు బాగా లేటు అవటంతో ఈ సమస్య వస్తోంది. అయితే 2021 ని మాత్రం రెండు సినిమాలో ఫ్యాన్స్ పండుగ చేయబోతున్నారు. 
  
వాటిలో మొదటిది అందరూ ఊహించేదే రాధే శ్యామ్. ప్రస్తుతం ప్రొడక్షన్ జరుగుతోంది. అయితే లాస్ట్ షెడ్యుల్ షూట్ చేస్తున్నారు. 2021లో పక్కాగా ఈ సినిమా వస్తుందని అందరికీ తెలుసు. రాధే శ్యామ్ అయిన వెంటనే ..ప్రభాస్..సలార్ షూట్ లో పాల్గొనబోతున్నారట. ప్రశాంత్ నీల్ ..కంటిన్యూ షెడ్యుల్స్ తో ఈ సినిమాని పూర్తి చేసి 2021 దసరా కు రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. 
 
మరో ప్రక్క ప్రభాస్..హిందీలో చేస్తున్న ఆదిపురుష్ సినిమా, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఏది మొదట ప్రారంభం కానుందనేది తేలనుంది. అయితే 2021లోనే ఈ సినిమాల షూట్ మొదలవుతుంది. అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ ని ఆగస్ట్ 11, 2022 గా ఇప్పటికే ఎనౌన్స్ చేసారు కాబట్టి ఆ సినిమానే ముందు ప్రారంభం కానుంది. నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ మాత్రం 2023 కు జరిగే అవకాసం ఉంది.
 
Latest Videos

click me!