అల్లరి నరేష్ ఆశలపై.. అమేజాన్ నీళ్ళు.!

Published : Dec 14, 2020, 12:39 PM IST
అల్లరి నరేష్ ఆశలపై.. అమేజాన్ నీళ్ళు.!

సారాంశం

ఈ సినిమాని డైరెక్ట్ గా స్ట్రీమ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ అంగీకరించింది. భారీ మొత్తం ఇచ్చి ఈ మూవీ హక్కులను పొందినట్లు సమాచారం. దాన్ని బట్టి అర్దం అయ్యేదేమిటంటే... “నాంది” థియేటర్లో విడుదల కాదు. ముందుగా …. అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అవుతుంది.   

 

అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. నరేష్ తన రెగ్యులర్ స్టయిల్ కి భిన్నంగా చేసిన సినిమా ఇది. సీరియస్ రోల్, ఇప్పటికే  ‘నాంది’ టీజర్‌ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు. అయితే ఈ సినిమా థియోటర్ రిలీజ్ లేదని తెలుస్తోంది.  “నాంది” సినిమా ఓటిటి బాట పట్టనుంది. ఈ సినిమాపై అల్లరి నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. థియోటర్ లో రిలీజ్ అయితే తిరిగి తను ఫామ్ లోకి వస్తానని భావించాడు.  అయితే ఇప్పుడు ఓటీటి దారిలోకి వెళ్లటంతో నిరాశపడ్డాడని తెలుస్తోంది. కానీ అంతకు మించి దారి లేదు. 

ఈ సినిమాని డైరెక్ట్ గా స్ట్రీమ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ అంగీకరించింది. భారీ మొత్తం ఇచ్చి ఈ మూవీ హక్కులను పొందినట్లు సమాచారం. దాన్ని బట్టి అర్దం అయ్యేదేమిటంటే... “నాంది” థియేటర్లో విడుదల కాదు. ముందుగా …. అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అవుతుంది. 

ఇక సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ లాయర్‌ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్‌ అనే పోలీస్‌ పాత్రలో హరిశ్‌ ఉత్తమన్‌, సంతోష్‌గా నటుడు ప్రవీణ్‌ కనిపించనున్నారు. లాక్‌డౌన్‌ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.  ఈ చిత్రానికి కథ: తూమ్‌ వెంకట్‌, సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కూర్పు: చోటా కె.ప్రసాద్‌.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్