#TheRajaSaab 'రాజా సాబ్ '..కు రజనీ ఆ సూపర్ హిట్ కు పోలిక?

By Surya Prakash  |  First Published Feb 7, 2024, 11:47 AM IST

డైనోసార్‌.. పక్కా డార్లింగ్‌గా ట్రాన్స్ ఫర్మేషన్‌ అయిన సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా మన ముందుకు తీసుకురాబోతోంది.
 



ప్రభాస్ తాజ-ా చిత్రం “రాజా సాబ్” పై ఫస్ట్ లుక్ రిలీజైనప్పటినుంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అప్పటిదాకా ప్రభాస్, మారుతి కాంబినేషన్ ఏంటి అని పెదవి విరిచిన వాళ్లు ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. రాజా సాబ్ పోస్టర్ లో .. డార్లింగ్ లుక్ ని చూసిన అభిమానులు.. ఈ సినిమాపై మరింత ఎక్సపెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పోస్టర్ తప్ప .. ఇక ఏ అప్ డేట్స్ లేవు. పైగా ఈ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ, తాజాగా అందుతున్న  సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి అవుతుందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  “రాజా సాబ్” చిత్రం రజనీకాంత్ సూపర్ హిట్ చంద్రముఖి తరహాలో ఉండబోతోందిట. హారర్ కామెడీగా రూపొందే ఈ చిత్రం కథ,గెటప్ వంటి విషయాల్లో చంద్రముఖి కు సంభందం లేకుండా ఫార్మెట్ మాత్రం అలాగే ఉంటుందంటున్నారు. రాజా సాబ్ లో దెయ్యాలు ఉంటాయని, అక్కడ చంద్రముఖి బిల్డింగ్ లో కథ జరిగినట్లుగానే ఇక్కడ ఓ థియేటర్ లో కథ జరుగుతుందని అంటున్నారు. అలాగే ప్లాష్ బ్యాక్ కథకు కీలకంగా నిలుస్తుందని తెలుస్తోంది. క్లైమాక్స్ లో చాలా గ్రాఫిక్స్,విఎఫ్ ఎక్స్ వర్క్ ఉంటుందని, దానిపై చాలా ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కల్కి రిలీజ్ దాకా ఈ సినిమా విషయాలు దాచి పెడతారని ఆ సినిమా తర్వాతే రివీల్ చేస్తారని అంటున్నారు. 

Latest Videos

 ఏదైమైనా హారర్ కామెడీ జానర్ లో రెడీ అవుతున్న ది రాజా సాబ్(The Raja Saab)  ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది .  లోకల్ ఆడియన్స్ కి ఒకప్పటి ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి లాంటి… టచ్ ఉన్న కమర్షియల్ మూవీ ని ఇవ్వలేక్ పోయాడు….సలార్(Salaar) బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపినా కూడా వింటేజ్ ప్రభాస్ అయితే ఇంకా తిరిగి రాలేదు… ఇలాంటి టైంలో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా మూవీని అనౌన్స్ చేయగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి అఫీషియల్ గా..వింటేజ్ లుక్ తో రావటం మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.  డైనోసార్‌.. పక్కా డార్లింగ్‌గా ట్రాన్స్ ఫర్మేషన్‌ అయిన సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా మన ముందుకు తీసుకురాబోతోంది.

'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.
 

click me!