#LalSalaam:‘లాల్‌ సలాం’కి రజనీ గెస్ట్ రోల్ కానీ రికార్డ్ రెమ్యునరేషన్

రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రజినీ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. 



  రజినీ కాంత్ కీలకపాత్ర పోషించిన ‘లాల్ సలాం’రిలీజ్ కు రెడీ అయ్యింది. విష్ణు విశాల్ – విక్రాంత్ ఇందులో హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి  ఐశ్వర్య రజనీకాంత్  దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో నడిచే కథగా దీన్ని రూపొందిందిన ఈ చిత్రంలో రజనీ గెస్ట్ రోల్ లో అంటే 30 నుంచి 40 నిముషాలు మాత్రమే కనిపించనున్నట్లు సమాచారం.  రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రజినీ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. మోయిద్దీన్ భాయ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.దాంతో ఈ చిత్రం నిమిత్తం రజనీకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

 తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రజనీ కనిపించే ఆ కొద్ది సేపు కు 40 కోట్లు రెమ్యునరేషన్ గా పే చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాకు రజనీ ఒప్పుకున్నది కేవలం తన కూతురు దర్శకత్వం అనే అనేది నిజం. తమ కూతురు సినిమా కాకపోతే రజనీ గెస్ట్ రోల్ లో చేయరు.  ట్రైలర్ రిలీజైన తర్వాత ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ పెరిగిపోయింది.   అయితే మొదటి నుంచి రజనీ గెస్ట్ రోల్ అని చెప్పినా ఇప్పుడు బిజినెస్ జరిగే సమయంలో రజనీ సినిమా అన్నట్లుగానే కొంటున్నారట.
  
ఇక ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. లైకా నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఈ నెల 9న విడుదల చేయనున్నారు.   ఇందులో రజినీకీ సోదరిగా జీవిత నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ బాణీలు సమకూర్చారు.  ‘‘లాల్‌ సలాం’ చిత్రంలో ముంబై డాన్‌  మొయిద్దీన్‌  భాయ్‌ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్‌.  
 

Latest Videos

click me!