ప్రభాస్ రాజాసాబ్ ఆగమనం, టీజర్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్.. పిక్ లీక్ అయ్యాక మేల్కొన్నారా..

Published : Jun 02, 2025, 08:39 PM IST
the raja saab coolie to kantara most awaited south movies in 2025

సారాంశం

రాజా సాబ్ చిత్ర యూనిట్ టీజర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చింది. మంగళవారం రోజు ఉదయం 10:34 గంటలకి రాజా సాబ్ టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

రాజా సాబ్ టీజర్ అప్డేట్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం రాజా సాబ్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం, రిలీజ్ వాయిదా పడుతుండడంతో ఫ్యాన్స్ లో కొంత నిరాశ నెలకొంది. ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు రాజా సాబ్ చిత్ర యూనిట్ రెడీ అయింది.  

రాజా సాబ్ ఆగమనం 

తాజాగా చిత్ర యూనిట్ టీజర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చింది. మంగళవారం రోజు ఉదయం 10:34 గంటలకి రాజా సాబ్ టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాజా సాబ్ ఆగమనం అంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో దేశం మొత్తం ట్రెండింగ్ గా మారింది. 

 

 

రాజాసాబ్ టీజర్ జూన్ 15, 2025న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అదే రోజున సినిమా విడుదల తేదీపై కూడా ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాజా సాబ్ మూవీలో హీరోయిన్లు  

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ పాత్రకు తాతగా కీలక పాత్రలో కనిపించనున్నారు. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో సలార్ పార్ట్ 2, కల్కి 2, హను రాఘవపూడి ఫౌజీ , స్పిరిట్  లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ రాజా సాబ్ చిత్రం ప్రభాస్ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నారు.  

లీక్ అయ్యాక నిద్ర లేచారు

ఇటీవల ఈ చిత్రం నుంచి ఒక పిక్ లీక్ అయింది. వీడియో ఫుటేజ్ నుంచి ఆ పిక్ ని కట్ చేసి ఎవరో వైరల్ చేశారు. అంటే చిత్ర యూనిట్ లోనే ఎవరో ఇలా చేశారు. దీనితో అలెర్ట్ అయిన రాజా సాబ్ టీమ్ వీలైనంత త్వరగా టీజర్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. పిక్ లీక్ అయ్యాక రాజా సాబ్ చిత్ర యూనిట్ నిద్ర లేచారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌