పెద్దాయన వదిలేయండి, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ ఏమన్నారంటే?

Published : Jun 02, 2025, 07:27 PM IST
Ali responds to Rajendra Prasad controversial comments

సారాంశం

ఈమధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. తాజాగా కమెడియన్ అలీపై చేసిన కామెంట్లు మరింత దుమారం రేపాయి. సోషల్ మీడియాలో నటకిరీటిని దారుణంగా ట్రోల్ చేస్తున్న క్రమంలో, అలీ ఈ వివాదంపై స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

 

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా రాజేంద్ర ప్రసాద్

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన వ్యాఖ్యలతో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమాలతో పాటు పబ్లిక్ ఈవెంట్‌లలో ఆయన చేసే వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే “రాబిన్ హుడ్” సినిమా ఈవెంట్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

నోరు జారిన రాజేంద్ర ప్రసాద్

తాజాగా, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆయన, తన సహచరుడు అలీ గురించి ఒక బూతుపదం ఉపయోగిస్తూ సరదాగా ప్రస్తావించారు. ఈ మాటలు అక్కడ ఉన్న సెలబ్రిటీలను ఆశ్చర్చపరిచాయి. ఇక అది పబ్లిక్ ఈవెంట్ అవ్వడంతో వెంటనే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు ఈ వ్యాఖ్యను అసహ్యించుకుంటూ రాజేంద్ర ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై అలీ స్పందన

ఈ ఇక ఈ వ్యాఖ్యలపై తాజాగా అలీ స్వయంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియోలో అలీ ఇలా అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఆయన సరదాగా అన్నది. కానీ దీన్ని పెద్ద విషయంగా తీసుకుంటున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయన కుమార్తె ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కావాలని అలా అనలేదు. దయచేసి దీన్ని రచ్చ చేయకండి. ఆయన పెద్దాయన, గౌరవించాలి,” అని అలీ స్పష్టం చేశారు.

అలీపై కామెంట్స్ కు వివరణ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా రాజేంద్రప్రసాద్ స్పందించారు. హైదరాబాద్‌లో తను నటించిన షష్టిపూర్తి సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను అందరితో సరదాగా ఉంటాను . వాళ్లు నాతో అలాగే ఉంటారు. ఇటీవల కొన్ని ఈవెంట్స్‌లో నేను గబాల్న ఫ్లోలో అనేసిన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ సంస్కారం. నేనేంటో అందరికి తెలుసు. ఫ్లోలో అన్న మాటలను తప్పుగా తీసుకోవడం మీ అభిప్రాయం,” అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?
Akira Nandan నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ క్రేజీ రియాక్షన్‌