
తెలుగు చిత్ర పరిశ్రమలో రీ-రిలీజ్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టిన రోజుల సందర్భంగా వాళ్ళ పాత సినిమాలను 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలు వాళ్ళ బర్త్‌డే సందర్భంగా విడుదలై రికార్డు కలెక్షన్‌లు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ రీ-రిలీజ్ ప్రభాస్ వంతుకు వచ్చింది.
అక్టోబర్23 న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈయన నటించిన ‘బిల్లా’, ‘వర్షం’ సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఊహించని విధంగా ప్రభాస్ బర్త్‌డేకు వారం రోజుల ముందే మరో సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ రెబెల్ పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నటుడు, డాన్స్ డైరక్టర్, దర్శకుడు అయిన లారెన్స్ దర్శకత్వంలో 2012లో రెబెల్ సినిమా రూపొందింది. తన ఫ్యామిలీ మరణానికి కారణమైన వారిపై ఓ కుర్రాడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పాయింట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రెబెల్‌గా ప్రభాస్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించగా కృష్ణంరాజు కీలక రోల్ చేశారు. తమన్నా హీరోయిన్‌గా నటించింది.
అయితే అదే సమయంలో ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. ఈ చిత్రం ‘డార్లింగ్’, ‘Mr. పర్‌ఫెక్ట్’ వంటి వరుస హిట్లతో స్పీడ్ మీదున్న ప్రభాస్‌కు రెబల్ మూవీ బ్రేకులు వేసింది. అయితే ఇప్పటికి ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్లను అభిమానులు ఉండటమే కారణం అంటున్నారు. లారెన్స్ ఈ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా, సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. అయితే దీనిపై సోషల్ మీడియా జనం మాత్రం ‘రెబల్’ సినిమాను రిలీజ్ చేసే బదులు ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’,ఏక్ నిరంజన్ వంటి చిత్రాలు రిలీజ్ చేస్తే బావుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.