ఆచార్య సినిమా ఫెయిల్యూర్ తో చాలా పెద్ద మొత్తంలో వదులుకున్నాను 

Published : Oct 14, 2022, 09:09 AM ISTUpdated : Oct 14, 2022, 09:15 AM IST
ఆచార్య సినిమా ఫెయిల్యూర్ తో చాలా పెద్ద మొత్తంలో వదులుకున్నాను 

సారాంశం

ఆచార్య జ్ఞాపకాలు చిరంజీవిని వెంటాడుతూనే ఉన్నాయి. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్స్ లో కూడా ఆయన ఆ విషయం వదలడం లేదు. మరోసారి ఆచార్య ఫెయిల్యూర్ పై చిరంజీవి స్పందించారు.   

గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ చిరంజీవి ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. సినిమాకు మరికొన్ని వసూళ్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా దర్శకుడు పూరి జగన్నాధ్ తో ఆన్లైన్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. నిన్న చిరంజీవి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆచార్య ఫెయిల్యూర్ పై స్పందించారు. సినిమా అనేది సమిష్టి కృషి అని నేను నమ్ముతాను. ఒక సినిమా విజయంలో అందరి సహకారం ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఆచార్య సినిమాతో నేను డిజాస్టర్ చూశాను. ఆ సినిమా ఫెయిల్యూర్ కి బాధ్యత వహిస్తూ పెద్ద మొత్తం వదులుకున్నాను. చరణ్ కూడా వదిలేశాడు. 

బయ్యర్లు బయటపడతారనే ఆలోచనతో మేము ఆ పని చేశాము. అందుకే ఆచార్య విషయంలో నేను అపరాధ భావం ఫీల్ కావడం లేదన్నారు. ఆచార్య మూవీ రెమ్యూనరేషన్ లో 80 శాతం నేను, చరణ్ తిరిగి ఇచ్చేశామని చిరంజీవి మీడియా ముందు వెల్లడించారు. బయ్యర్లకు దర్శకుడు కొరటాల శివ ఆస్తులు అమ్మి డబ్బులు చెల్లించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

ఇక గాడ్ ఫాదర్ నేను చేయాలనే ఆలోచన దర్శకుడు సుకుమార్ ది అన్నారు. లూసిఫర్ చిత్రానికి కొన్ని మార్పులు చేస్తే నాకు చక్కగా సరిపోతుందని చరణ్ తో సుకుమార్ అన్నారట. సుకుమార్ సలహాలు ఇచ్చారు కానీ తర్వాత అందుబాటులోకి రాలేదు. దీంతో చరణ్ తని ఒరువన్ తెరకెక్కించిన మోహన్ రాజాను సూచించాడు. ఆ విధంగా లూసిఫర్ రీమేక్ బాధ్యతలు మోహన్ రాజాకు అప్పగించడం జరిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. 

ఇక గాడ్ ఫాదర్ మూవీ నష్టాలు మిగుల్చుతుందని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్న క్రమంలో నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఖండించారు. గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఎవరికీ అమ్మలేదు. సొంతగా విడుదల చేశాము. మేము ఊహించిన దానికంటే అధిక లాభాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్