నేను రోమియో టైప్‌ కాదంటున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

Published : Feb 14, 2021, 09:42 AM ISTUpdated : Feb 14, 2021, 09:45 AM IST
నేను రోమియో టైప్‌ కాదంటున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

సారాంశం

ప్రభాస్‌ తన అభిమానులకు వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే ప్రేమికుల రోజున ఈ చిత్రం నుంచి చిన్న గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. 

ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం `రాధేశ్యామ్‌`. `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతుంది. 

ప్రభాస్‌ తన అభిమానులకు వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే ప్రేమికుల రోజున ఈ చిత్రం నుంచి చిన్న గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలోని ప్రభాస్‌ తన ప్రియురాలైన పూజా హెగ్డేని రకరకాల పేర్లతో పిలుస్తున్నట్టుగా, తన ప్రేమని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ వీడియో గ్లింప్స్ ఉంది. 

అయితే ప్రభాస్‌ పూజని పిలుస్తుండగా, నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? అని పూజా హెగ్డే అంటే,  అతను ప్రేమ కోసం చనిపోయాడు. నేను ఆ టైప్‌ కాదు అని ప్రభాస్‌ అంటాడు. 52 సెకన్లపాటు ఉన్న ఈ గ్లింప్స్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఓ అడవి నుంచి రైల్‌ బయలు దేరడం, అది రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు జనంలోని ప్రభాస్‌ ఎగురుతూ లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు. అందుకు పూజా రియాక్ట్ అవ్వడం బాగుంది. సినిమా ప్రధానంగా రైల్‌ చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది యూనిట్‌. జులై 30న విడుదలై చేయబోతున్నారు. ఈ సినిమాకి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు.ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుందని వినికిడి. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?