అనుష్క శెట్టి నయా మూవీ ప్రారంభం.. అంతా సైలెంట్‌గానే?

Published : Feb 14, 2021, 08:15 AM IST
అనుష్క శెట్టి నయా మూవీ ప్రారంభం.. అంతా సైలెంట్‌గానే?

సారాంశం

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి నటించబోతున్న కొత్త సినిమా ప్రారంభమైంది. `రా రా కృష్ణయ్య` ఫేమ్‌ పి.మహేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. యూవీ క్రియేషన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. 

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి నటించబోతున్న కొత్త సినిమా ప్రారంభమైంది. `రా రా కృష్ణయ్య` ఫేమ్‌ పి.మహేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. యూవీ క్రియేషన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. పూజా కార్యక్రమాల్లో `రాధేశ్యామ్‌` దర్శకుడు రాధాకృష్ణ.. దేవుడి చిత్ర పటాలపై క్లాప్‌ నిచ్చారు. 

ఇందులో అనుష్క మెయిన్‌ లీడ్‌గా నటిస్తుండగా, `ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ని జరుపుకోనుంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి నిర్మాణ సంస్థగానీ, అనుష్క గానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అనుష్క చివరగా గతేడాది `నిశ్శబ్దం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇది ఓటీటీలో విడుదలై పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా సైలెంట్‌గా ప్రారంభించుకోవడం గమనార్హం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది