Latest Videos

కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్... అదిరిన ప్రోమో!

By Sambi ReddyFirst Published Jan 12, 2024, 11:58 AM IST
Highlights


ప్రభాస్ సలార్ ఫీవర్ ముగియక ముందే కల్కి 2829 AD  అప్డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ విడుదల తేదీ ప్రకటించారు. థియేటర్స్ లో దీనికి సంబంధించిన స్పెషల్ ప్రోమో విడుదల చేశారు. 
 


ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సలార్ ఫీవర్ ఫ్యాన్స్ లో ఇంకా తగ్గలేదు. ఈ లోపే కల్కి 2829 AD అప్డేట్ తో మైండ్ బ్లాక్ చేశారు. కల్కి చిత్ర విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటుంది. 

2024 జనవరి 12న కల్కి విడుదల చేస్తున్నట్లు మొదట ప్రకటించారు. అయితే అనుకున్న ప్రకారం షూటింగ్ ముగియలేదు. దాంతో పోస్ట్ ఫోన్ చేశారు. కల్కి విడుదల చేయాలనుకున్న తేదీనే కొత్త విడుదల తేదీ ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. కల్కి మూవీ సమ్మర్ కానుకగా మే 9న విడుదల కానుంది. విడుదల తేదీ ప్రోమో ఆకట్టుకుంది. సూపర్ హీరో గెటప్ లో ప్రభాస్ మెస్మరైజ్ చేశారు. 

ఇక కల్కి టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. హీరో కాలాల్లో ప్రయాణం చేస్తాడట. భవిష్యత్ ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించినట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ సందర్భంలో తెలియజేశాడు. అనూహ్యంగా డివోషనల్, ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారట. 

కల్కి చిత్రంలో భారీ కాస్ట్ నటిస్తున్నారు. కమల్ హాసన్ ఎంట్రీతో ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరిగింది. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుంది. అలాగే అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్. ఇలా అనేక స్పెషల్ అట్రాక్షన్స్ లో కల్కి లో ఉన్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

click me!