నన్ను నా కుటుంబాన్ని బాధపెట్టారు.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్..?

By Mahesh JujjuriFirst Published Jan 12, 2024, 9:36 AM IST
Highlights

బాలీవుడ్ బాద్ షా ఎమోషనల్ అయ్యారు. తనను తన కుటుంబాన్ని బాధపెట్టారంటూ.. ఫస్ట్ టైమ్ కామెంట్స్ చేశారు. తన పరిస్థితి బాగోలేని రోజులు గురించి మొదటి సారి స్పందించారు షారుఖ్. 

బాలీవుడ్ ను రాజులా ఏలారు షారుఖ్ ఖాన్. కాని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా..? షారుఖ్ ఖాన్ కు కూడా కష్టాలు తప్పలేదు. కాని ఆ టైమ్ లో తాను అనుభవించిన బాధను తాజాగా ఓ సందర్భంలో వెల్లడించారు షారుఖ్ ఖాన్. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కాని అన్నింటిని దాటుకుని లాస్ట్ ఇయర్ అంటే 2023 ను తనకు గోల్డెన్ఇయర్ గా మార్చుకున్నారు షారుఖ్. కంప్లీట్ గా నిద్రపోతున్న బాలీవుడ్ కు రెండు సార్లు వెయ్యి కోట్ల సినిమాలను అందించి.. తాను నిలబడి.. బాలీవుడ్ ను కూడా నిలబెట్టారు షారుఖ్.  

అందుకే బాలీవుడ్ చరిత్రలో 2023ను  షారుక్ నామ సంవత్సరంగా పేరు పెట్టేశారు సినీజనాలు. ఈ ఏడాది పఠాన్,జవాన్, డంకీ సినిమాలతో రెండున్నార వేల కోట్ల కలెక్షన్లు కొల్లకొట్టాడు షారుఖ్. పేర్కొనవచ్చు. ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇలాంటిరికార్డ్ లేనే లేదు. పడిలేచినకెరటంలా.. ఉవ్వెత్తున ఎగసిన స్టార్ హీరో.. ప్రస్తుతం గతంకంటే కూడా మంచి ఫామ్ నుమెయింటేన్ చేస్తున్నాడు. 

Latest Videos

ఎంత పెద్ద స్టార్ అయినా.. కెరీర్ లో ఏదొ ఒక పెద్ద యుద్దం చేయాల్సిందే. అవాంతరంఎదురవ్వాల్సిందే.. స్ట్రగుల్ లైఫ్ ను చూడాల్సింది. షారుఖ్ కూడా ఓ మూడేళ్లు అలానే ఇబ్బందిపడ్డాడు. ఇబ్బంది అంటే అంతా ఇంతా కాదు. వరుస డిజాస్టర్లు ఎదురవుతుంటే.. బాలీవుడ్ లో తలెత్తుకోలేక సినిమాలు చేయడం ఆపేశాడు. లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. సరిగ్గా అదే టైమ్ లో షారుఖ్ తనయుడు ఆర్యాన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. తనను తన ఫ్యామిలీని మరింత కృంగదీసింది. 

ఆ టైమ్ లో తనను ఓదార్చి.. ధైర్యం చెప్పిన వారు కొందరైతే.. ఇదే మంచి టైమ్ అనుకుని.. ఇంకా బాధపెట్టినవారు కూడా ఉన్నారంటున్నాడు షారుఖ్. అయితే ఈ విషయాల గురించి ఎప్పుడూ నోరువిప్పని షారుఖ్... ఈమధ్యే ఓపెన్ అయ్యాడు. తన జీవితంలో అత్యంత బాధాకర రోజుల గురించి అతను మాట్లాడాడు. ఇంతకీ షారుఖ్ ఇంకేమననారంటే..గత ఏడాది నాకు గొప్పగా సాగింది. మరపురాని విజయాలను అందుకున్నాను. ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమను చూపించారు. కానీ ఈ మూడు సినిమాలకు ముందు నేను చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాను. చాలా ఏళ్లుగా నా సినిమాలేవి సరిగా ఆడలేదు. అపజయాలు ఎదురయ్యాయి. దీని మీద మీడియాలో రకరకాలుగా రాశారు. 

నా పని అయిపోయిందని అన్నారు. అప్పుడు చాలా బాధపడ్డా. అది చాలదని నా కొడుకు మీద డ్రగ్స్ కేసు.. నన్ను, నా కుటుంబాన్ని కుదిపేసింది. అప్పుడు చాలామంది నిజా నిజాలు తెలియకుండా.. తెలుసుకోకుండా..  అసహ్యకరమైన కామెంట్లు చేశారు. కానీ అన్నిటికీ మౌనమే సమాధానమని ఊరుకున్నా. తర్వాత అన్ని సమస్యల నుంచి బయటపడ్డా. నా సినిమాలు విజయాలు సాధించాయి. పఠాన్ నాకు మళ్ళీ ఊపిరి పోసింది. కష్టాలు వస్తే జీవితం ఆగిపోయిందని అనుకోకండి. ఆశతో జీవించండి అయిపోయింది అని షారుక్ పేర్కొన్నాడు.

click me!