
దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు బద్దలుకొట్టిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటింది. ఈ మూవీతోనే టుసాడ్స్ వరకూ వెళ్లింది ప్రభాస్ స్టేటస్. బాహుబలిగా అలరించిన ప్రభాస్ ఆ చిత్రం తరువాత యంగ్ డైరెక్షర్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆమె డ్యూయల్ రోల్‌లో కనిపించబోతుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై స్పందించిన శ్రద్ధా.. 'సినిమాలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అయితే నేను డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నానని రూమర్స్ వచ్చాయి. అందులో నిజం లేదు. చేసేది ఒక్క పాత్రే అయినా చాలా షేడ్స్ ఉంటాయి. సినిమాలో నేను యాక్షన్ సీన్స్‌లో కూడా నటిస్తాను' అంటూ తన పాత్రపై క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆమె తెలుగు నేర్చుకునే పనిలో పడింది. స్పష్టంగా తెలుగు మాట్లాడలేకపోయినా కనీసం డైలాగ్స్ చెప్పగలిగే విధంగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది.
మరోవైపు శ్రద్ధా ఇప్పటికే సాహో షూటింగ్ లో చేరిపోయింది. బాహుబలి ప్రభాస్ శ్రద్ధా కోసం స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశాడట. అందులో హైదరాబాద్ స్పెషల్ డిషస్ 18 వరకు వడ్డించారట. దీంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది శ్రద్ధ. ఇదిగోండి మెన్యూ...