పవన్ కల్యాణ్ ను విమర్శించే కత్తి మహేష్ పై రంగంలోకి దిగిన సంపూ

Published : Sep 13, 2017, 04:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
పవన్ కల్యాణ్ ను విమర్శించే కత్తి మహేష్ పై రంగంలోకి దిగిన సంపూ

సారాంశం

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యామ్ ను విమర్శిస్తున్న కత్తి మహేష్ బిగ్ బాస్తో వచ్చిన ఫేం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ ను టార్గెట్ చేసిన కత్తి మహేష్ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ను విమర్శించడాన్ని తప్పుబట్టిన సంపూ

పవన్ కళ్యాణ్ పై గత కొంతత కాలంగా విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్ రోజు రోజుకూ రెచ్చిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని.. తనను చంపేస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ నెత్తీ నోరూ బాదుకుంటున్నాడు. ఇలా గత కొన్ని రోజులుగా కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ రగడ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చూస్తునే వున్నాం. పవన్ సినీరంగం, రాజకీయ రంగంపై విమర్శలు చేసిన కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతూ..మెసేజ్ లు పెడుతూ.. ఫోన్స్ కాల్స్ చేసి నానా హంగామా చేశారు. సినిమాల పై విశ్లేషణ అందించే కత్తి మహేష్ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోయినా.. బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాక అతనికి గుర్తింపు లభించింది.

 

ఇక పవన్ కల్యాణ్ విషయంలో జోక్యం చేసుకోవడంతో సోషల్ మీడియాలో మరింత పాపులర్ అయ్యాడు.  పవన్ కల్యాణ్ గురించి త్తి మహేశ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ అభిమానులే కాదు ఇండస్ట్రీలో ఆయనను ఎంతగానో అభిమానించే నటులు కూడా రియాక్ట్ అవుతున్నారు.  తాజాగా హృదయ కాలేయం చిత్రంతో బర్నింగ్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు వాక్ స్వాతంత్య్రం ఎవరికైనా ఉంటుంది .. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో .. ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలని కాస్త గట్టిగానే స్పందించారు. 

 

వ్యక్తులపై ఎవరికైనా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది..కానీ ఆ వ్యక్తి పట్ల సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు బేరీజు వేసుకుని, వాళ్లను విమర్శించే స్థాయి మనకు వుందా లేదా కూడా చూసి ఆచీ తూచీ.. మాట్లాడితే ఎవరికైనా మంచిదని అన్నారు. పవన్ కల్యాణ్ మంచి నటుడు కాకపోతే .. ఇన్ని కోట్ల మంది మనసులను గెలవడం ఎలా సాధ్యమని అడిగాడు. పవన్ విషయంలో మహేశ్ కత్తి అలా మాట్లాడి ఉండకూడదనీ, ఆయన ధోరణి తనకి చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు సంపూ.

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి