ట్రోల్స్ పై ప్రభాస్ సీరియస్.. ఏం చేయబోతున్నాడంటే?

Published : Sep 17, 2019, 05:58 PM ISTUpdated : Sep 17, 2019, 06:07 PM IST
ట్రోల్స్ పై ప్రభాస్ సీరియస్.. ఏం చేయబోతున్నాడంటే?

సారాంశం

  టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడని అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి కాంట్రవర్సీ ల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. అయితే సాహో దెబ్బకి ప్రభాస్ సోషల్ మీడియాలో 'వచ్చిన ట్రోలింగ్ సెగలు ప్రభాస్ ని తాకినట్లు తెలుస్తోంది. 

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడని అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి కాంట్రవర్సీ ల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. అయితే సాహో దెబ్బకి ప్రభాస్ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ సెగలు ప్రభాస్ ని తాకినట్లు తెలుస్తోంది. 

మెయిన్ గా ప్రభాస్ లుక్ పై ఊహించని విమర్శలు వెలువడ్డాయి. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ లుక్స్ అలాగే మేకప్ పై ట్రోల్స్ వెలువడ్డాయి. ఈ విషయంపై ప్రభాస్ కొంత అసంతృప్తికి లోనైట్లు టాక్. అందుకే నెక్స్ట్ సినిమాకు సంబందించిన యూనిట్ తో ఇటీవల చర్చలు జరిపాడట. ముఖ్యంగా కాస్ట్యూమర్ అలాగే మేకప్ ఆర్టిస్ట్ తో వర్క్ షాప్ కి ప్రిపేర్ అవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. 

నెక్స్ట్ ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ట్రోలర్స్ కి కౌంటర్ పడేలా అదిరిపోయే లుక్స్ తో కనిపించాలని రెబల్ స్టార్ డిసైడ్ అయినట్లు సమాచారం. లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఆ కొత్త లుక్స్ అభిమానుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?