మోడీ బయోపిక్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్

By Prashanth MFirst Published Sep 17, 2019, 5:30 PM IST
Highlights

నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి దేశమంతా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మాత్రం స్పెషల్ గా ఒక పోస్టర్ ద్వారా తన విషెష్ ని అందించారు. 

నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి దేశమంతా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మాత్రం స్పెషల్ గా ఒక పోస్టర్ ద్వారా తన విషెష్ ని అందించారు. మోడీ జీవిత ఆధారంగా తెరకెక్కిన `మ‌న్ బైరాగి` అనే సినిమాను తెలుగులో `మ‌నో విరాగి` పేరుతో విడుదల చేయనున్నారు. 

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సమర్పణలో  సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వంలో ఈ బ‌యోపిక్‌ రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మొదటి పోస్టర్ ని నేడు విడుదల చేశారు. బాహుబలి ప్రభాస్  పోస్టర్ ని రిలీజ్ చేయగా ఒక్కసారిగా ఆ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

స్పెషల్ పర్సన్ పై రూపొందుతోన్నస్పెషల్ సినిమా. స్పెష‌ల్ రోజున ఫిలిమ్ మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. హ్యాపీ బ‌ర్త్ డే న‌రేంద్ర‌మోదీగారు. సంజ‌య్ లీలా భ‌న్సాలి, మ‌హావీర్ జైన్ నిర్మిస్తోన `మ‌న్ బైరాగి` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే మోదీగారి అన్‌టోల్డ్ స్టోరీకి సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారని ప్రభాస్ పేర్కొన్నారు.

 

click me!