ఇక బాక్సాఫీస్ బద్దలే.. చరణ్, తారక్ లతో కలిసి సినిమా చేస్తా.. స్వయంగా వెల్లడించిన ప్రభాస్

గెట్ రెడీ ఫ్యాన్స్.. త్వరలో టాలీవుడ్ నుంచి అతి భారీ ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది. ముగ్గరు స్టార్ హీరోలతో  భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమాచేస్తానంటూ ప్రకటించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 

prabhas Says NTR and Ram Charan my friends we are going to work Sure JMS

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఊహించని విధంగా క్రేజీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయో చెప్పలేం కాని భారీ మల్టీ స్టారర్లు.. ఊహించని విధంగా ఫ్యాన్స్ ను అలరించబోతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్  ఆస్కార్ సాధించి ప్రపంచ సినిమా పటంలో టాలీవుడ్ ను నిలబెట్టింది. ఇక త్వరలో అంతకు మించిన మల్టీ స్టారర్ మూవీ సందడ చేయబోతోంది. ఈ విషయం సోషల్ మీడియా న్యూస్ కాదు... రూమర్ కూడా కాదు.. స్వయంగా స్టార్ హీరో ప్రభాస్ ప్రకటించినదే. 

అవును త్వరలో ముగ్గురు స్టార్ హీరోలతో భారీ సినిమాకు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. తనకు రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులని.. వారితో కలిసి తప్పకుండా సినిమా చేస్తానన్నారు. అంతే కాదు ఇది తప్పుకుండా జరుగుతుంది అన్నట్టుగా.. షూర్..పక్కా అనినొక్కి మరీ చెప్పారు.  నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో కల్కీ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీ అమెరికాలోనే కామిక్ కాన్ సినిమా ఉత్సవాలలో పాల్గొనే అవకాశం సాధించింది. ఇండియాలోనే ఈ గౌరవం దక్కిన ఫస్ట్ సినిమా గా కల్కీ రికార్డ్ కెక్కింది. అప్పటి వరకూ ప్రాజెక్ట్ కె గా వర్కింగ్ టైటిల్ తో పిలవబడిన ఈసినిమా  టైటిల్ ను ఈ ఉత్సవాలలోనే కల్కీగా ప్రకటించారు టీమ్. 

Latest Videos

 

Charan is my friend we are going to work one day 🔥🔥
:)
If it happens it will be a biggest collaboration in indian cinema 💥 pic.twitter.com/I7iouTzSmh

— ₵₳₱₮₳ł₦ 𝕀𝕟𝕕𝕚𝕒™ (@captain_India_R)

ఇక తాజాగా ఈ ఈవెంట్ లో మాట్లాడిన ప్రభాస్ కు ఆర్ఆర్ఆర్ గురించి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి గురించి ప్రశ్న ఎదురయ్యింది. దాంతో స్సందించిన ప్రభాస్ ఇలా అన్నారు. రాజమౌళి గురించి మాట్లాడుతూ, ఇండియాలో ఉన్న గొప్ప దర్శకుల్లో రాజమౌళి ఒకరని, ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం తనకు ఆనందాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు.అలాగే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, చరణ్ తనకు మంచి ఫ్రెండ్ అని, భవిష్యత్తులో చరణ్ తో కలిసి పనిచేస్తానని ప్రభాస్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టింట మటలు పుట్టిస్తున్నాయి. ముగ్గరు స్టార్ హీరోల ఫ్యాన్స్ లో లేని పోని ఆశలు రేకిత్తిస్తున్నాయి. 

భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ముగ్గరు స్టార్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు  కలిసి పనిచేస్తే బాక్సాఫీసు బద్దలైపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ అన్నట్టుగా ఈసినిమా వస్తే బాగుండు అని ముగ్గురు స్టార్ హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముగ్గురు కలిసినటించడం..అదికూడా రాజమౌళి దర్శకత్వంలో చేస్తే.. ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బద్దలవుతాయని అంటున్నారు. 

vuukle one pixel image
click me!