మేమిద్దరం కట్టె కాలెంత వరకు చిరంజీవి అభిమానులమే.. అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్

By Asianet News  |  First Published Jul 21, 2023, 1:58 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘బేబీ’ మూవీ అప్రిషియేషన్ మీట్ కు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానం ఎలాంటి చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 
 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్యలో AAA  సినిమాస్ మల్టీ ప్లెక్స్  ప్రారంభోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లో సందడి చేశారు. ఆ తర్వాత తాజాగా Baby movie నిర్వహించిన అప్రిషియేషన్ మీట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అప్పటికే ఈ మూవీని చూసిన బన్నీ ట్వీటర్ వేదికన అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. ఇక కార్యక్రమానికి హాజరై తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. 

కొన్నాళ్లుగా బన్నీ ఎలాంటి ఫంక్షన్ కు హాజరైన తన మాటలతో వ్యక్తిత్వాన్నిమరింతగా పెంచుకుంటున్నారు. బన్నీమాటలు చాలా హుందాగా, అటు అభిమానులను, ఇటు సినీ పెద్దలను మెప్పించేలా ఉంటున్నాయి. ఇక తాజాగా బేబీ మూవీ అప్రిషీయేషన్ మీట్ లోనూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పై తనకున్న అభిమానం ఎలాంటిదో చెప్పారు. బన్నీ మాట్లాడుతూ.. ‘ఏదీ ఇది మారదు.. నేను నిర్మాత ఎస్కేఎన్ కట్టె కాలేంత వరకు చిరంజీవి అభిమానులమే! అది ఎన్నటికీ మారదు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Latest Videos

చిరంజీవి సైట్ లోని ఓ డాన్స్ ఫోర్ట్ లో నేను డ్యాన్స్ చేసేవాడిని. అక్కడే ఉన్న చిన్న గదిలో ఎస్కేఎన్ ఎన్నో ఏళ్లు ఉన్నారు. ఆ గది వాచ్ మెన్ రూమ్ కంటే చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత జర్నలిస్టుగా, పీఆర్వోగా, ప్రొడ్యూసర్ గా మారి ఎస్కేఎన్ సక్సె అయ్యారు’ అని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ‘బేబీ’ ఈవెంట్ లోనే పవర్ ఫుల్ డైలాగ్ నూ విడుదల చేశారు. ‘ ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతుండాది.. పుష్ప గాడి రూల్’ అంటూ డైలాగ్ ను లీక్ చేశారు. సినిమాపై ఆసక్తి పెంచారు. ఇక బేబీ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో  హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మించారు.  సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. జూలై 14న సినిమా థియేటర్లలో విడుదలై బ్రహ్మండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

Katta kaalentha varuku Chiranjeevi fan a
- at appreciation meetpic.twitter.com/xCixaJ5KR9

— Hemanth Kiara (@ursHemanthRKO)
click me!