షేక్ చేస్తున్న సలార్ టీజర్, పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..ఎన్ని వ్యూస్ వచ్చాయంటే.

Published : Jul 06, 2023, 09:37 PM IST
షేక్ చేస్తున్న సలార్ టీజర్, పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..ఎన్ని వ్యూస్ వచ్చాయంటే.

సారాంశం

సోషల్ మీడియాను షేక్ చేస్తోంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలర్ టీజర్.  ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్ డేట్ టీజర్ రూపంలో రావడంతో.. పండగ చేసుకుంటున్నారు. ఒకింత అసంతృప్తి తో కూడా ఉన్నారు. 


పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కేజీఎఫ్ సిరీస్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్  డైరెక్ట్ చేసిన సినిమా సలార్.  ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సలార్ సినిమాలో ప్రభాస్ జోడీగా శృతీ హాసన్ నటిస్తోంది. ఈసినిమాను వచ్చే సెప్టెంబర్ 28.. 2023 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా  రేంజ్ లో.. ఐదు భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈమూవీ నుంచి ఎప్పుడెప్పుడా అని ఫ్యాస్స్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తుండగా.. సాలిడ్ అప్ డేట్ అందించారు ప్రభాస్ టీమ్. 

తాజాగా ఈసినిమా నుంచి సలార్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇక  టీజర్ కు ఆడియన్స్ నుంచి  అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అవ్వడంతోనే..మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది సలార్ టీజర్. అంతే కాదు ఇప్పటి వరకూ లాసర్ టీజర్ కు దాదాపు 65 మిలియన్స్ అంటే దాదాపు ఆరున్నర కోట్ల వ్యూస్ త పాటు.. 20 లక్షల వరకూ లైకులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమాలో  ప్రభాస్, శృతీ హాసన్ తో పాటు..  జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉంది.సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్స్ ఒకటే వచ్చింది. ఇక తాజగా టీజర్ అప్డేట్ రావడంతోనే..సలార్ ఊపు మొదలయ్యింది. అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.

ఇక టీజర్ లో.. KGF ని మించి మాస్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు. KGF లో హీరోకి ఇచ్చినట్టే ఇక్కడ కూడా ప్రభాస్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. సలార్ పార్ట్ 1 ceasefire అని టీజర్ చివర్లో వేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్