ప్రభాస్ ‘సలార్ ’ వాయిదా?.. కొత్త తేదీ ఎప్పుడంటే..?

Published : Sep 01, 2023, 04:41 PM ISTUpdated : Sep 01, 2023, 04:43 PM IST
 ప్రభాస్ ‘సలార్ ’  వాయిదా?..  కొత్త తేదీ ఎప్పుడంటే..?

సారాంశం

ప్రభాస్ అభిమానులతో పాటు యాక్షన్‌ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్‌’ (Salaar) ఒకటి.  ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా అది క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది.

సినీ ప్రియుల అందరి దృష్టీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ సలార్ పైనే ఉన్న సంగతి తెలిసిందే.  హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ కిరాగందూర్ నిర్మిస్తున్న ఈ మూవీ  ట్రైలర్ కోసం అందరి ఎదురుచూపులు. ముఖ్యంగా టీజర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ చిత్రం గురించి టాక్ జనాల్లో మరీ హాట్ గా మారింది. ఈ నేపధ్యంలో  ట్రైలర్ కోసం ఎదురూచూస్తుంటే ఓ షాకింగ్ న్యూస్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అదేమిటంటే....‘సలార్ ’రిలీజ్ డేట్ వాయిదా పడుతోంది. సెప్టెంబర్ 28 న రిలీజ్ అయ్యే అవకాసం లేదని డిసెంబర్ లో రిలీజ్ అని డిస్ట్రిబ్యూటర్స్ కు అనీఫిషియల్ గా చెప్తున్నారని మీడియాలో వినిపిస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఏదీ ఫిక్స్ కాలేదని ..ఫోస్ట్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాసం ఉందంటున్నారు. దాంతో  #Salaar ట్రైలర్  ని సెప్టెంబర్ 6 బుధవారం వదులుతున్నారా లేదా అనేది ప్రశ్నార్దంకంగా మారింది. ట్రైలర్ రిలీజ్ లో  ఏ మార్పు ఉండదని ఈ ట్రైలర్ ని 7 వ తేదీ వచ్చే షారూఖ్ `జవాన్` సినిమాతో కలపనున్నారని అంటున్నారు.  ఇంటర్వెల్ లో ఈ ట్రైలర్ వస్తుంది. అంటే పెద్ద తెరపై ట్రైలర్ ని ఏడవ తేదీన చూడవచ్చు అన్నమాట.  

ఇక ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ ట్రైలర్‌లో కూడా యాక్షన్స్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. ట్రైలర్‌లో యాక్షన్‍ను అధికంగా చూపించేందుకే చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. సలార్ స్టోరీ గురించి ట్రైలర్‌లో ఎక్కువగా రివీల్ చేయకూడదని డిసైడ్ చేసుకుందని సమాచారం.
 
 హోంబలే ఫిల్మ్స్‌ తెలుగులో నిర్మిస్తున్న మొదటి చిత్రం సలార్. ప్రభాస్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు.  ప్రభాస్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్ తో యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా కోసం డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ