
డైనమిక్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా' (Ginna). అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అక్టోబర్ 21న (రేపు) థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్, మంచు విష్ణుకు సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ‘జిన్నా’ టీంకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ‘ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్ మంచు విష్ణు. ‘జిన్నా’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో నీకు మంచి ఫలితం అందాలని ఆశిస్తున్నాను. రిలీజ్ సందర్భంగా వదిలిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది.’ అని పేర్కొన్నారు. ఇందుకు మంచు విష్ణు కూడా డార్లింగ్ కు రిప్లై ఇచ్చారు. ‘థ్యాంక్ యూ మై డార్లింగ్ బ్రదర్ ప్రభాస్. ‘జిన్నా’కు మీ మద్దతు ఉండటం నాకు నిజంగా సర్ ప్రైజ్ గా ఉంది. లవ్ యూ’ అంటూ ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మనోజ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ నెట్టింట పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. మంచు విష్ణు సరికొత్తగా కనిపిస్తుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్ (Payal Rajput), సన్నీ లియోన్ గ్లామర్ రోల్ లో కనువిందు చేయనుండటం మరింత ఆసక్తిగా మారింది. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్రలో అలరించనున్నారు. వీకే నరేష్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, సత్యం రాజేష్, సురేష్ తదితర పాత్రలను పోషిస్తున్నారు.