అల్లు అర్జున్ - రామ్ చరణ్ తో భారీ మల్టీస్టారర్.. అల్లు అరవింద్ ఇచ్చిన అప్డేట్ కు దిమ్మతిరిగిపోద్ది?

Published : Oct 20, 2022, 02:58 PM IST
అల్లు అర్జున్ - రామ్ చరణ్ తో భారీ మల్టీస్టారర్..  అల్లు అరవింద్ ఇచ్చిన అప్డేట్ కు దిమ్మతిరిగిపోద్ది?

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ భారీ మల్టీస్టారర్ లో నటించనున్నారని తెలుస్తోంది. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అదిరిపోయే అప్డేట్ అందించారు. 

‘పుష్ప’తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ‘ఆర్ఆర్ఆర్’తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్ గా నిలిచారు. ప్రస్తుతం వారి అభిమానులు తదుపరి చిత్రాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో  సోషల్ మీడియాను షేక్ చేసే వార్త ఒకటి బయటికి వచ్చింది. అందులోనూ ప్రముఖ నిర్మాతనే ఈ విషయాన్ని చెప్పడంతో నెట్టింట దుమారం రేపుతోంది.  ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే రామ్ చరణ్, బన్నీ కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా అల్లు అర్జున్ వెల్లడించారు. 

ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్, అల్లు అర్జున్ తో మల్టీ స్టారర్ తీయాలనేది తన కోరిక అనిచెప్పారు.  గతంలో చెర్రీతో ‘మగధీర’ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అరవింద్ ఫైనాన్షియల్ గా చాలానే రిస్క్ చేశారంట. మొత్తం డబ్బులు పెట్టుబడిగా పెట్టి.. మూడింతలు సంపాదించినట్టు తెలిపారు. అయితే అదే సమయంలో బన్నీ, చరణ్ తో మల్టీ స్టారర్ రూపొందించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇందుకోసం పదేండ్ల కిందనే ‘చరణ్ - అర్జున్’అనే టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారంట.

అయితే ఇప్పటికీ ఈ భారీ మల్టీ స్టారర్ కోసం ఎలాంటి కథను ఫైనల్ చేయలేదంట. ప్రస్తుతం వారిద్దరూ పాన్ ఇండియన్ స్టార్స్ గా దూసుకుపోతుండటంతో ఇంకాస్తా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఎప్పటికైనా వారిద్దరితో భారీ మల్టీస్టారర్ తీయాలన్నదే ఆయన కోరిక అని చెప్పారు. ఏదేమైనా అల్లు అరవింద్ ఇటీవల తెలుగు ఆడియెన్స్ ను అప్డేట్స్ ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే తమ బ్యానర్ లో రిలీజ్ చేసిన ‘కాంతార’ సినిమాను తెలుగులో విడుదల చేసి మంచి ఫలితాన్ని అందుకున్నారు. తాజాగా బన్నీ, చరణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చి ఆడియెన్స్ లో ఆసక్తి పెంచారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సీక్వెల్ భారీగా రూపుదిద్దుకోనుంది. ఈ నెలలోనే షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి