Arun Vijay: సాహో నటుడు అరుణ్ విజయ్ కి కరోనా

Published : Jan 06, 2022, 05:39 PM ISTUpdated : Jan 06, 2022, 05:40 PM IST
Arun Vijay: సాహో నటుడు అరుణ్ విజయ్ కి కరోనా

సారాంశం

చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ కి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అరుణ్ విజయ్ స్వయంగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

దేశంలో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి అధికమవుతుంది. రోజురోజుకు తీవ్రత అధికం అవుతుండగా థర్డ్ వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 90 వేలకు పైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ కి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అరుణ్ విజయ్ స్వయంగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 

ట్విట్టర్ వేదికగా అరుణ్ విజయ్(Arun Vijay)... అందరికీ నమస్కారం. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు క్వారంటైన్ కావడం జరిగింది. అలాగే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి... అని తెలియజేశారు. అరుణ్ విజయ్ కి కరోనా సోకిందని తెలుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అలాగే త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

ప్రభాస్ (Prabhas) హీరోగా 2019లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మూవీలో అరుణ్ విజయ్ కీలక రోల్ చేశారు. ఇక అరుణ్ 25వ చిత్రంగా విడుదలైన తాడం భారీ విజయం సాధించింది. ఈ మూవీలో అరుణ్ డ్యూయల్ రోల్ చేశారు. తాడం అరుణ్ ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. తమిళంలో అరుణ్ బిజీ హీరోగా మారారు. ఆయన దాదాపు ఆరు చిత్రాల వరకు తమిళంలో చేస్తున్నారు. 

ఇక కొద్ది రోజుల క్రితం కమల్ హాసన్ (Kamal Haasan)కరోనా బారిన పడ్డారు. అలాగే ప్రముఖ కమెడియన్ వడివేలుకు సైతం కరోనా సోకింది. అలాగే మంచు హీరో మనోజ్ ఇటీవల కరోనా బారినపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయం తెలియజేశారు. రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా సోకడం ఆలోచించాల్సిన విషయం. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం అత్యవసరమని నమోదవుతున్న కేసుల ద్వారా తెలుస్తుంది. వ్యాక్సిన్ రిస్క్ శాతం తగ్గిస్తుంది, అంతే కానీ పూర్తిగా కరోనా రాకుండా చేయలేదని సమాచారం. 

దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు స్కూల్స్ పూర్తిగా మూసివేశాయి. ఢిల్లీ రాష్ట్రంలో థియేటర్స్ సైతం బంద్ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక  రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి