Acharya controversy: చిక్కుల్లో మెగాస్టార్ 'ఆచార్య'.. పోలీసులకు ఫిర్యాదు, మరీ ఇంతలా అవమానిస్తారా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 06, 2022, 04:44 PM ISTUpdated : Jan 06, 2022, 04:45 PM IST
Acharya controversy: చిక్కుల్లో మెగాస్టార్ 'ఆచార్య'.. పోలీసులకు ఫిర్యాదు, మరీ ఇంతలా అవమానిస్తారా

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'.  చిత్రం కోసం చాలా రోజులుగా అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాలిడ్ కంటెంట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'.  చిత్రం కోసం చాలా రోజులుగా అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాలిడ్ కంటెంట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికి వరకు చిత్ర యూనిట్ నుంచి విడుదలవుతూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచుతూనే వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన స్పెషల్ సాంగ్ 'శానా కష్టం' కూడా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

ఈ ఐటెం నంబర్ లో చిరంజీవితో కలసి రెజీనా స్టెప్పులేసింది. హాట్ గా కనిపిస్తూనే మెగాస్టార్ సరసన చిందేసింది. దీనితో యూట్యూబ్ లో ఈ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు భాస్కర బట్ల సాహిత్యం అందించారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 

చిరంజీవి, మణిశర్మ లది డెడ్లీ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆచార్య చిత్రం వివాదంలో పడింది. అందుకు కారణం 'శానా కష్టం' పాటే. సినిమాల్లో ప్రస్తుతం చిన్న పొరపాటు కనిపించినా వివాదంగా మారిపోతోంది. తాజాగా ఆచార్య చిత్రంపై తెలంగాణలోని జనగాంలో ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

ఈ పాటలో 'ఎడాడో నిమరోచ్చని కుర్రాలంతా ఆర్ఏపీలు అయిపోతున్నారే' అనే లిరిక్ ఉంది. శానా కష్టం పాటలోని ఈ లిరిక్ ఆర్ఎంపీ డాక్టర్ల ఆగ్రహానికి కారణం అయింది. రెజీనా లాంటి అందమైన మహిళని ఆర్ఎంపీ వైద్యులు అసభ్యంగా ముట్టుకుంటారు అనే సంకేతాలు వెళ్లేలా ఈ పాట రాశారు. అది మా వృత్తినే అవమానించే విధంగా ఉంది అంటూ ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఆచార్య చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీత రచయిత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం పై ఆచార్య చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

Also Read: నిధి నల్ల చీర ఎంత పని చేసింది.. అందాలన్నీ చూపించేసిందిగా, మైండ్ బ్లాక్ అయ్యే హాట్ నెస్

PREV
click me!

Recommended Stories

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?