అభిమానులకు ప్రభాస్ ఫేస్ బుక్ సందేశం

Published : Sep 29, 2017, 09:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అభిమానులకు ప్రభాస్ ఫేస్ బుక్ సందేశం

సారాంశం

ఫేస్ బుక్ లో అభిమానులకు ప్రభాస్ సందేశం ప్రభాస్ సందేశంలో స్వచ్ఛ భారత్ అంతా స్వఛ్చ బారత్ కు పనిచేస్తే దేశం మరింత అందంగా వుంటుందన్న ప్రభాస్

బాహుబలి స్టార్ ప్రభాస్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ గురించి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ పిలుపు మేరకు ప్రభాస్ డార్లింగ్ తన అభిమానులకి స్వచ్ఛ భారత్ సందేశాన్నిచ్చాడు. పరిశుభ్రతకే ప్రాధాన్యత ఇచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2వ తేదీ సమీపిస్తున్న తరుణంలో గాంధీజీ ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి మద్దతు పలికి స్వచ్ఛ భారత్ కోసం కృషి చేయాల్సిన అవసరం వుందన్నాడు ప్రభాస్.

 

దేశ పౌరుడిగా పరిశుభ్రతను పాటించడం అనేది కేవలం విధిగా కాకుండా ఒక అలవాటుగా మార్చుకోవాలని ప్రభాస్ అభిప్రాయపడ్డాడు. తనలాగే క్లీన్ ఇండియా కోసం పాటుపడే వాళ్లు తమ ఆశయాన్ని కొనసాగించాల్సిందిగా ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకి విజ్ఞప్తి చేశాడు ప్రభాస్. 

 

ప్రతీ ఒక్కరు స్వచ్ఛభారత్ కోసం పాటుపడితే మన దేశం ఇప్పుడున్నదానికన్నా మరింత అందంగా తయారవుతుందని అభిమానులకి సూచించిన ప్రభాస్ అంతిమంగా జై హింద్‌తో తన సందేశాన్ని ముగించాడు.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..