Spirit Movie Role Leak: ప్రభాస్‌ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌ ఆ పాత్రలో.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ ?

Published : Jan 04, 2022, 08:57 PM IST
Spirit Movie Role Leak: ప్రభాస్‌ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌ ఆ పాత్రలో.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ ?

సారాంశం

`అర్జున్‌ రెడ్డి`తో టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.  ప్రభాస్‌తో `స్పిరిట్‌` చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో ప్రభాస్‌ నటించే పాత్ర లీక్‌ అయ్యింది. `ఆదిపురుష్‌` నిర్మాత భూషణ్‌ కుమార్‌ అనూహ్యంగా ప్రభాస్‌ పాత్ర గురించి వెల్లడించినట్టు తెలుస్తుంది.  

పాన్‌ ఇండియా స్టార్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా పిలిపించుకుంటున్న ప్రభాస్‌(Prabhas).. పేరుతో ఇప్పుడు మూడువేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. అంటే ఇప్పుడు `ప్రభాస్‌` అనే పేరు ఒక బ్రాండ్‌, ఒక వ్యవస్థ` అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మూడు సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఓ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. 

`అర్జున్‌ రెడ్డి`తో టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై సస్పెన్స్ నెలకొంది.. అదే సమయంలో ప్రభాస్‌తో `స్పిరిట్‌`(Spirit) చిత్రాన్ని ప్రకటించారు. ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇండియాలోనే కాదు, ఇతర దేశాల భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో ప్రభాస్‌ నటించే పాత్ర లీక్‌ అయ్యింది. `ఆదిపురుష్‌`(Adipurush)నిర్మాత భూషణ్‌ కుమార్‌ అనూహ్యంగా ప్రభాస్‌ పాత్ర గురించి వెల్లడించినట్టు తెలుస్తుంది.  

Prabhas 25వ చిత్రంలో పోలీస్‌గా కనిపించబోతున్నారని భూషణ్‌ కుమార్‌ చెప్పినట్టు ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌-సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తోన్న `స్పిరిట్‌` చిత్రమే 25వ సినిమా కావడం విశేషం. దీంతో ప్రభాస్‌ పాత్ర ఏంటో తెలియడంతో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. తన 25 సినిమాల కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నారని చెప్పొచ్చు. ప్రభాస్‌ ఇప్పటి వరకు మాఫియా తరహా పాత్రలు, లవర్‌ తరహా పాత్రలు పోషించారు. `మున్నా`, `రెబల్‌`, `బిల్లా`, `సాహో` చిత్రాల్లో ఆయన డాన్‌ తరహా స్టయిలీష్‌ పాత్రల్లో అదరగొట్టారు. కానీ పోలీస్‌గా కనిపించలేదు.  ఫస్ట్ టైమ్‌ ఆయన కాప్‌గా అలరించబోతున్నారట. ఆయన పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండబోతుందని తెలుస్తుంది. 

ప్రభాస్‌ ఇప్పటి వరకు పోలీస్‌ పాత్రలో కనిపించకపోవడంతో ఆయన్ని పోలీస్‌ ఆఫీసర్‌గా చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వారి కోరిక తీరబోతుందని భూషణ్‌ కుమార్‌ కామెంట్స్ ని బట్టి తెలుస్తుంది.  ఈ గుడ్ న్యూస్‌తో అభిమానులు ఫెస్టివల్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారని టాక్‌. అంతేకాదు అభిమానులు ఊగిపోయేలా ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ పాత్ర ఉంటుందని టాక్‌.  ఇక ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రంలో నటించగా, అది సంక్రాంతి కానుకగా 14న విడుదల కాబోతుంది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ చిత్ర విడుదలపై ఇంకా సస్పెన్స్ నెలకొంది.  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ పామిస్ట్(హస్త జాతకుడు)గా కనిపించనున్నారు.

మరోవైపు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్‌. ఇందులో కూడా ఆయన కార్మికుల నాయకుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో  రాముడి పాత్రని ప్రభాస్‌ పోషిస్తున్నారు. కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటిస్తున్నారు. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కే` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్‌. దీపికా పదుకొనె కథానాయికగా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఇందులో ప్రభాస్‌ పాత్ర ఏంటనేది క్లారిటీ లేదు.

also read: టబు, శోభన, నగ్మా, జయప్రద, రేఖ, సితార.. ఒంటరి అందాల తారలు.. ఆ దారిలో సమంత?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?