ఫ్యాన్స్ మీ రివ్యూ ఇవ్వండి... ఆదిపురుష్ త్రీడి టీజర్ స్క్రీనింగ్ ఈవెంట్ లో ప్రభాస్!

By Sambi ReddyFirst Published Oct 6, 2022, 9:45 PM IST
Highlights

ఆదిపురుష్ చిత్ర టీజర్ కి నెగిటివ్ మార్క్స్ పడ్డాయి. ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. దీంతో టీమ్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రేపు ఆదిపురుష్ టీజర్ ని త్రీడి థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు.

ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో ట్రోల్స్ గురైన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం  టీజర్ అందుకోలేదు. వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. యాంటీ ఫ్యాన్స్ మరోవైపు ట్రోల్స్ కి తెగబడ్డారు. అదే సమయంలో హిందూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎటు చూసినా ఆదిపురుష్ చిత్రానికి కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఊహించని ఈ నెగిటివిటీ నుండి ఎలా బయటపడాలో ఆదిపురుష్ టీమ్ కి అర్థం కావడం లేదు. 

అదే సమయంలో మీరు ఊహించినట్టు కాదు. టీవీలు, మొబైల్స్ లో ఆదిపురుష్ టీజర్ చూసి ఓ అభిప్రాయానికి రావొద్దు. ఇది త్రీడి మోషన్ కాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించిన సినిమా. బిగ్ స్క్రీన్ కోసం ప్రత్యేకంగా తెరకెక్కించింది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి పంచడానికి రూపొందిన చిత్రం అంటున్నారు. దర్శకుడు ఓం రౌత్ ట్రోల్స్ ని ఉద్దేశిస్తూ ఇదే వివరణ ఇచ్చారు. ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయాలని టీం భావిస్తున్నారు. 

నేడు హైదరాబాద్ లో ఆదిపురుష్ త్రీడీ టీజర్ స్క్రీనింగ్ ఈవెంట్ నిర్వహించారు. హాజరైన విలేఖరులకు, చిత్ర ప్రముఖులకు త్రీడీ కళ్లజోళ్లు ఇచ్చి టీజర్ ప్రదర్శించారు. అనంతరం నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ మాట్లాడారు. చివర్లో హీరో ప్రభాస్ మాట్లాడారు. అనుకున్న సమయం కంటే లేటుగా వచ్చినందుకు ఆయన సారీ చెప్పాడు. ఇక త్రీడీ ఫార్మాట్ లో టీజర్ చూసి ఆయన థ్రిల్ ఫీలయ్యానని అన్నారు. 

విజువల్స్, యానిమల్స్ ముఖంపై ఆడటం తెలియని అనుభూతిని పంచిందన్నారు. రేపు ఫ్యాన్స్ కోసం 60 త్రీడీ థియేటర్స్ లో టీజర్ ప్రదర్శించనున్నాము. మీరు త్రీడీ టీజర్ చూసి మాకు  రివ్యూ చెప్పాలని కోరారు. మీ అభిప్రాయం ముఖ్యం ఎందుకంటే ఇది మీ కోసం తీసిన సినిమా.. థియేటర్స్ లో టీజర్ చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను అన్నారు. ఆదిపురుష్ బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాల్సిన చిత్రమని మరోసారి ప్రభాస్ గుర్తు చేశారు. 

అలాగే మరో రెండు మూడు వారాల్లో అదిరిపోయే కంటెంట్ తో ప్రోమో విడుదల చేయనున్నట్లు ప్రభాస్ చెప్పారు. కాగా 2023 జనవరి 12న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. కృతి సనన్ సీత పాత్ర చేయగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర చేశారు. 

click me!