ఆదిపురుష్ డైరెక్టర్ పై ప్రభాస్ రగిలిపోతున్న ప్రభాస్... విశ్వసనీయ సమాచారం  ఇదే!

By Sambi ReddyFirst Published Oct 6, 2022, 6:34 PM IST
Highlights

ఓం రౌత్ కి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని ఓ న్యూస్ చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ని సీరియస్ గా రూమ్ కి పిలుస్తున్న వీడియో వైరల్ కాగా ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. 

ఆదిపురుష్ టీజర్ తీవ్ర విమర్శల పాలైంది. టీజర్ లో రాముడు, రావణుడు, హనుంతుడు గెటప్స్ చూసి హిందూవాదులు మండిపడుతున్నారు. అలాగే ఆదిపురుష్ మూవీ సీజీ వర్క్ దారుణంగా ఉందనేది నెటిజెన్స్ అభిప్రాయం. ఆదిపురుష్ టీజర్ కార్టూన్ చిత్రాలను తలపించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ సీరియస్ గా దర్శకుడు ఓమ్ రౌత్ ని రూమ్ కి పిలుస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ప్రభాస్... వేలు చూపుతూ ఓం నువ్వు నా రూమ్ కి రా... అంటూ పిలిచారు. 

ఆదిపురుష్ టీజర్ బాగోలేదన్న అసహనంతో ఓం రౌత్ ని రూమ్ కి పిలిచి ప్రభాస్ కోప్పడ్డాడని, దర్శకుడికి హీరోకి మధ్య గొడవలు జరిగాయంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి దర్శకుడు వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వర్మ... ప్రభాస్ ఆదిపురుష్ డైరెక్టర్ ని తిట్టాడు అనడంలో నిజం లేదన్నారు. దానికి ఆయన తన లాజిక్ చెప్పాడు. ప్రభాస్ కి అత్యంత సన్నిహితుడు చెప్పిన సమాచారం ప్రకారం... ఆదిపురుష్ టీజర్ జస్ట్ రిలీజైన నిమిషాలకు వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉన్న సంఘటన జరిగింది. 

నిజానికి ఆదిపురుష్ టీజర్ కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం రూమ్ కి ఓం రౌత్ ని పిలిచాడు. ఆదిపురుష్ విడుదలైన నెక్స్ట్ డే నుండి ట్రోల్స్ షురూ అయ్యాయి. తమ టీజర్ ట్రోల్స్ కి గురవుతుందని అప్పటికి ప్రభాస్ కి తెలియదు. అలాగే రిలీజ్ కి ముందే ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ చూసి ఉంటాడు. ఒకవేళ తనకు నచ్చకపోతే విడుదల ఆపివేసేవాడు. అందరితో పాటు ఆయన టీజర్ చూశారంటే అది అతిశయోక్తి అవుతుంది. 

ఓం రౌత్ కి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడని ప్రచారం జరగడానికి మరొక కారణం, ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ ఎలా ఉంటారో ఏవరికీ తెలియదు. ఆయన పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. నవ్వుతూ మాట్లాడతాడు. అలా చూసిన ప్రభాస్ ఏదో ఏమరపాటులో ఓం రౌత్ ని ఇన్ఫార్మల్ గా పిలవడం కొత్తగా అనిపించింది. కాబట్టి ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ పై కోప్పడ్డాడు అనేది నిజం కాదన్నారు. 
 

click me!