నార్త్ ఆడియన్స్ నాలో ఆ యాంగిల్ ఇంకా చూడలేదు.. ప్రభాస్ క్రేజీ కామెంట్స్

By tirumala ANFirst Published Jun 24, 2024, 3:15 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD. మహానటి చిత్రం తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న అతి భారీ ప్రయత్నం ఇది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD. మహానటి చిత్రం తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న అతి భారీ ప్రయత్నం ఇది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. 

అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో సాగుతున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బాహుబలి నుంచి నార్త్ లో ప్రభాస్ హవా మొదలయింది. బాహుబలి నుంచి ప్రభాస్ అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. ప్రభాస్ లోని నాటీ నెస్, కామెడీ టైమింగ్ నార్త్ ఆడియన్స్ కి తెలియదు. 

Latest Videos

కల్కి చిత్రంలో తన పాత్రలో అన్ని షేడ్స్ ఉన్నాయని ప్రభాస్ తెలిపాడు. నా పాత్రలో కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. ఇది నా కెరీర్ లో నే బెస్ట్ రోల్ అని ప్రభాస్ తెలిపాడు. సూపర్ హీరోగా కనిపిస్తాను.. అలాగే నాలో ఫన్నీ యాంగిల్ కూడా కనిపిస్తుంది. 

నాగ్ అశ్విన్ బాగా ఎంటర్టైన్ చేసే విధంగా నా పాత్రని తీర్చి దిద్దాడు అని ప్రభాస్ తెలిపారు. తెలుగులో డార్లింగ్ లాంటి చిత్రాల్లో ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. 

కల్కి చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తున్నాడు. మరి దీపికా కడుపున పుట్టే దేవుడు ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. 

click me!