Latest Videos

స్టార్ హీరోతో ‘యాత్ర’డైరక్టర్ నెక్ట్స్ కన్ఫర్మ్, ప్యాన్ ఇండియా ఫిల్మ్ ?

By Surya PrakashFirst Published Jun 24, 2024, 9:59 AM IST
Highlights

జగన్ ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు మహి వి రాఘవ ఓ కొత్త చిత్రంతో మన ముందుకు రావటానికి రంగం సిద్దం చేస్తున్నారు. అయితే ఈ సారి హీరో ఎవరు


మహి వి రాఘవ అనగానే మనకు యాత్ర సినిమానే గుర్తు వస్తుంది. అది  పొలిటికల్ జోనర్‌లో తెరకెక్కిన  సినిమానే అయినా బాగా ఆడింది.  ‘యాత్ర’ మూవీ ఏ అంచనాలు లేకుండా విడుదలయ్యి.. బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. అదే విధంగా వైఎస్ జగన్ కూడా పాదయాత్రను చేపట్టాడు. అందుకే జగన్ పాదయాత్రపై కూడా సినిమాను తెరకెక్కిస్తానని దర్శకుడు మహి వీ రాఘవ ఎప్పుడో ప్రకటించాడు. 

‘యాత్ర’ కంటే ఎక్కువగా బడ్జెట్ పెట్టి మరీ ‘యాత్ర 2’ను తెరకెక్కించారు. ఫిబ్రవరీ 10న విడుదలయిన ఈ మూవీ వర్కవుట్ కాలేదు. మొదటి భాగంతో పోలిస్తే ‘యాత్ర 2’కు అందులో పది శాతం  కలెక్షన్స్ కూడా రాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దర్శకుడికి సాయంగా నిలబడాలని నిర్ణయించుకుందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయ్యిపోయారు. ఈ లోపు జగన్ ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు మహి వి రాఘవ ఓ కొత్త చిత్రంతో మన ముందుకు రావటానికి రంగం సిద్దం చేస్తున్నారు. అయితే ఈ సారి హీరో ఎవరు

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మళయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు వీళ్లద్దరు కలసి కొన్ని ఐడియాలు చర్చించారని, త్వరలోనే  ఫైనల్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టుకు పూర్తి సపోర్ట్ ఇచ్చి, నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. 
 
మరో  ప్రక్క మహి వి రాఘవ ఇప్పటికే సేవ్ ద టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సీరిస్ లతో ఓటిటిలో మంచి సక్సెస్ అందుకున్నారు. మరో ప్రక్క దుల్కర్ ఇప్పుడు తెలుగులో వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. మహానటి తర్వాత ఆయన సీతారామమ్ చేసారు. అలాగే ఇప్పుడు లక్కీ భాస్కర్ చేస్తున్నారు. కల్కి సినిమాలో కూడా దుల్కర్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దుల్కర్ మళయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి వస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ తో సినిమా చేయటం మంచి ఆలోచన అని మహి వి రాఘవ భావించి ముందుకు వచ్చారని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ కాంబినేషన్ పై అతి త్వరలోనే ఎనౌన్సమెంట్ వస్తుంది. 
 

click me!