బాబోయ్, కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి ఊరమాస్..బర్త్ డే టీజర్, తనకిష్టమైన రోల్ లో రచ్చ రచ్చ

By tirumala ANFirst Published Jun 24, 2024, 11:49 AM IST
Highlights

బింబిసార, డెవిల్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల తర్వాత కళ్యాణ్ రామ్ మరో చిత్రం చేస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. 

బింబిసార చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ కి ఎక్కడలేని జోష్ తీసుకువచ్చిన చిత్రం అది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ చిత్రాలే చేస్తున్నారు. 

బింబిసార, డెవిల్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల తర్వాత కళ్యాణ్ రామ్ మరో చిత్రం చేస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. తన తాత గారు స్వర్గీయ ఎన్టీఆర్ బర్త్ యానవర్సరీ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఈ చిత్ర ప్రకటన చేశారు. ఆల్రెడీ ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. 

Latest Videos

ఈ మూవీలో సర్ప్రైజ్ ఏంటంటే.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు.నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విజయశాంతి పాత్రని పరిచయం చేస్తూ పవర్ ఫుల్ టీజర్ వదిలారు. ఈ టీజర్ లో విజయశాంతి లో అందరిని థ్రిల్ చేస్తోంది. 

పోలీస్ అధికారి పాత్రలకు విజయశాంతి పెట్టింది పేరు. కర్తవ్యం లాంటి చిత్రాల్లో విజయశాంతి చెలరేగిపోయింది. తనకి బాగా అచొచ్చిన పోలీస్ అధికారిగానే ఈ చిత్రంలో కనిపించింది. వైజయంతి ఐపీఎస్ పాత్రలో విజయశాంతి నటిస్తోంది. పోలీస్ డ్రెస్ విజయశాంతి యమా స్టైలిష్ గా ఉన్నారు. 

 

క్రిమినల్స్ తో ఆమె ఫైట్ చేస్తున్న విధానం చూస్తుంటే వింటేజ్ విజయశాంతి ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉంది. వాయిస్ ఓవర్ లో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ వినిపిస్తున్నాయి. 'వైజయంతి ఐపీఎస్.. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యూనిఫామ్ కి పౌరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం.. నేనే తన సైన్యం' అంటూ కళ్యాణ్ రామ్ చెబుతున్న డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 

సయీ మంజ్రేకర్ హీరోయిన్. శ్రీకాంత్ కీలక పాత్రలోఈ చిత్రంలో నటిస్తున్నారు. అశోక్ వర్ధన్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

 

click me!