Deepika Padukone:ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. చీరా సారె తో దీపికాకు వెల్కమ్ చెప్పిన టీమ్!

Published : Dec 04, 2021, 03:39 PM IST
Deepika Padukone:ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. చీరా సారె తో దీపికాకు వెల్కమ్ చెప్పిన టీమ్!

సారాంశం

ప్రభాస్ (Prabhas) కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది ప్రాజెక్ట్ కె. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఇటీవలే ప్రాజెక్ట్ కె సెట్స్ పైకి వెళ్లగా... హీరోయిన్ దీపికా పదుకొనె షూట్ లో జాయిన్ కానున్నారు.   

బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనె (Deepika padukone) కు ప్రాజెక్ట్ కె టీమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. వినూత్నంగా చీరా, సారెతో ఆమెకు ఆహ్వానం పలకడం విశేషం. దీపికా కోసం అందమైన చీర, వెండి భరణులలో పసుపు, కుంకుమ, గంధం నింపి.. గాజులు, పూలు ఉంచి ఒక బాక్స్ సిద్ధం చేశారు. దీపికాకు ఇవ్వనున్న ఈ సారె ఫోటోతో పాటు ఓ అద్భుతమైన వెల్కమ్ కార్డు రూపొందించారు . మీ రాకతో కలిసి ప్రపంచాన్ని జయిద్దాం.. అంటూ ఆ మెసేజ్ లో కోరుకున్నారు. ఈ సారెకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది. 


గతంలో ఎవ్వరూ ఓ హీరోయిన్ కి ఈ రేంజ్ లో ఆహ్వానం పలకలేదు. వైజయంతి మూవీస్ సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. ఇక దీపికా నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇది . కన్నడ పరిశ్రమకు చెందిన దీపికా బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన తర్వాత సౌత్ వైపు కన్నెత్తి చూడలేదు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కొచ్చిడయాన్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటించారు. 

Also read Radhe Shyam:ట్రైలర్ లో కనిపించే ఎలిమెంట్స్ ఇవే

దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది.ఈ మూవీ జోనర్ ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆదిపురుష్, రాధే శ్యామ్ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూట్ లో పాల్గొంటున్నారు. అలాగే సలార్ మూవీ షూటింగ్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. కాగా జనవరి 14న రాధే శ్యామ్ (Radhe shyam) విడుదల కానుంది. సలార్ సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఆగస్టు లో ఆదిపురుష్ విడుదల చేయనున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే