
వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్.. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని సినిమాలు చేస్తున్నాడు. కాని అఫీషియల్ గా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. అయితే ఈ వీడియో మాత్రం ప్రభాస్ అభిమానులను కాస్త నిరాశపరుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో సినిమా తెరకెక్కతుంది అని తెలపడానికి వీలుగా వీడియో రిలీజ్ చేశారు టీమ్. కాని అందులో ప్రభాస్ లుక్ ను మాత్రం ఎక్కడా రివిల్ చేయలేదు.
ఈ ఏడాది రెండు సినిమాలు ప్రభాస్ ను నిరాశపరచడంతో.. నెక్ట్స్ ఇయర్ మరో రెండు సినిమాలను సాలిడ్ గా రెడీ చేస్తున్నాడు ప్రభాస్. ఇక ఆతరువాత హాలీవుడ్ రేంజ్ లో ప్రాజెక్ట్ కెను సిద్ధం చేస్తున్నారు. దానికి తగ్గట్టు.. ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్వీన్. ఈక్రమంలోలే.. ప్రాజెక్ట్ k సినిమాని ప్రభాస్.. సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు న ఓ వీడియోని రిలీజ్ చేశారు టీమ్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక టైర్ కోసం మూవీ టీమ్ ఎంత కష్టపడుతున్నారు. దానికోసం మూవీ సెట్ లో టీమ్ ఏమనుకుంటున్నారు. వర్కర్స్ ఎలా సెటైర్లు వేస్తున్నారు. చివరకు అంత కష్టపడిన తరువాత ఆ టైర్ ఏ రేంజ్ లో ఎలివేట్ అయ్యింది అనే విషయాన్ని క్లియర్ గా చూపించారు. అంటే సినిమాను ఎంత క్వాలిటీతోతెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తీసుకురావడంకోసం ఎంత కష్టపడుతున్నారు అనేది చూపించే ప్రయత్నం చేశారు టీమ్. దాని కోసం టైమ్ పడుతుంది. ఎంత టైమ్ పట్టినా.. సినిమా మాత్రం పక్కా క్వాలిటీతో.. సాలిడ్ కంటెంట్ తో హాలీవుడ్ క్వాలిటీస్ తో వస్తుంది అని చెప్పకనే చెప్పారు టీమ్.
టాలీవుడ్ రేంజ్ మారిపోయింది.. డైరెక్టర్ల వ్యూ కూడా మారిపోయింది. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్లు రాజమౌళి వేసిన దారిలోనడుస్తూ.. కొత్తగా ఆలోచిస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని అందుకోవడం కోసం కష్టపడుతున్నాయి. అయితే అది ఎంతో దూరంలో లేదని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రూవ్ చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రాజెక్ట్ k వీడియోనే అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓ టైర్ కోసం వీడియో రిలీజ్ చేయడం.. బహుశా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం.
ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో థియేటర్లలోకి వచ్చాడు కానీ ఫ్యాన్స్ ని అయితే సంతృప్తి పరచలేకపోయాడు. అందకే నెక్ట్స్ ఇయర్ కోసం రెడీ అవుతున్నాడు ప్రభాస్. సలర్ ,ఆదిపురుష్ తో పాటు... మారుతీతో రాజాడిలక్స్.. సందీప్ రెడ్డితో స్పిరిట్ చేస్తున్నాడు ప్రభాస్. ఇక నెక్ట్స్ ఇయర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు జాతరే.