ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని, వైరల్ అవుతున్న పోస్టర్

Published : Dec 31, 2022, 07:36 AM IST
ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని,  వైరల్ అవుతున్న పోస్టర్

సారాంశం

ఫ్యాన్స్ ను న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు నేచురల్ స్టార్ నాని. సడెన్ గా కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈమూవీ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

గెలుపోటములతో సంబంధం లేకుండా వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఒక హిట్టు... ఒక ప్లాప్ అన్నట్టు సాగిపోతుంది నానీ మూవీ కెరీర్. దాంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు యంగ్ హీరో. వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు యంగ్ హీరో..  ఈ ఏడాది నాని నటించిన అంటే సుందరానికీ  బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది.. దాంతో జాగ్రత్త పడ్డ నాని.. జానర్ ను మార్చాడు..ప్రయోగాలు మాత్రం ఆపలేదు. ఈసారి క్లాస్ కాకుండా మాస్ ను ట్రై చేస్తున్నాడు. దసరా సినిమాతో ఊరమాస్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు నాని. 

మాస్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు కాని..మాస్ లుక్ ఒకే.. మాస్ పెర్ఫామెన్స్ ఉంటుందా లేదాఅనేదిచూడాలి. ఇక ఇది ఇలా ఉంటే.. సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు నాని. తన నెక్ట్స్ మూవీని కూడా లైన్ లో పెట్టేసి అప్ డేట్ ఇచ్చేశాడు. నెక్ట్స్ సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌లో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. అయితే ఈసినిమాకు  సంబంధించిన పూర్తి విషయాలను మాత్రం న్యూ ఇయర్‌ కానుకగా జనవరి 1న సాయంత్రం 4గంటల 5నిమిషాలకు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ పోస్టర్‌ను  కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. 

నాని ఈ మూవీలో ఫోటో గ్రాఫర్‌గా పనిచేయనున్నట్లు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి  పరిచయం చేయబోతున్నాడు నాని. ఈ మధ్య కొత్త దర్శకుల కథలను బాగా వింటున్నాడు నాని. కోత్తవారితో ప్రయోగాలు చేస్తూ.. వారికి ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తున్నాడు. క ఇప్పటికే నాని 5గురు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న దసరా మూవీ షూటింగ్ మాత్రం పరుగులు పెడుతోంది. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ  లో నానికి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఫస్ట్ టైమ్ ఈరేంజ్ లో..  నాని ఫుల్‌ లెంగ్త్‌ ఊరమాస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. దాంతో అటు నేచురల్ ఫ్యాన్స్ లో..ఇటు ఆడియాన్స్ అందరిలో ఓ క్యూరియాసిటీ ఏర్పడింది. అంతే కాదు సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.  2023 స్టార్టింగ్ లోనే ఈ మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు టీమ్. మరి ఈమూవీ అయినా కొత్త సంవత్సరం నానీకి హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో సినిమాలకు దూరం.. 35 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా