`పఠాన్‌` రికార్డులు బద్దలు కొట్టేందుకు ప్రభాస్‌ అస్త్రాలు రెడీ.. మరి `జవాన్‌` తట్టుకోగలడా?

Published : Mar 01, 2023, 06:05 PM ISTUpdated : Mar 01, 2023, 06:11 PM IST
`పఠాన్‌` రికార్డులు బద్దలు కొట్టేందుకు ప్రభాస్‌ అస్త్రాలు రెడీ.. మరి `జవాన్‌` తట్టుకోగలడా?

సారాంశం

`పఠాన్‌` మూవీ ఈ ఏడాది రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసే సత్తా ఈ ఏడాది రిలీజ్‌ కాబోతున్న సినిమాల్లో ఎవరికి ఉందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.

షారూఖ్‌ ఖాన్‌ దాదాపు ఏడేళ్ల తర్వాత హిట్‌ కొట్టాడు. `దిల్‌వాలే`, `డియర్‌ జిందగీ` చిత్రాల తర్వాత ఆయనకు విజయం వరించింది. అయితే సోలో హీరోగా సరైన హిట్‌ లేక దాదాపు 9ఏళ్లు అవుతుంది. `చెన్నై ఎక్స్ ప్రెస్‌`, `హ్యాపీ న్యూఇయర్‌` స్థాయి హిట్‌ ఇప్పుడు `పఠాన్‌` రూపంలో వరించింది షారూఖ్‌కి. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. హిందీలోనే ఇది ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. అద్భుతమైన యాక్షన్‌ ఎపిసోడ్లు, సల్మాన్‌ కోమియో, దీపికా గ్లామర్‌, యాక్షన్‌, దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ టేకింగ్‌ ఈ సినిమాకి కలిసొచ్చాయి. దీంతో పెద్ద విజయం సాధించి బాలీవుడ్‌కి ఊపిరి పోసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు `పఠాన్‌` రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఎవరికి ఉందనేది ఇప్పుడు ప్రశ్న. అయితే అది ప్రభాస్‌కి సాధ్యమంటున్నారు అభిమానులు.‌. ఆయన ప్రస్తుతం `ఆదిపురుష్‌`, `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో `ఆదిపురుష్‌`, `సలార్‌` ఈ ఏడాది రిలీజ్‌ కానున్నాయి. వీటిలో `ఆదిపురుష్‌`కి.. `పఠాన్‌` రికార్డులను బ్రేక్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఆ దమ్ము మాత్రం `సలార్‌`కి ఉందనే టాక్‌ అటు టాలీవుడ్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు అభిమానులు. 

`సలార్‌` పై క్రేజ్‌కి, అంచనాలకు కారణం `కేజీఎఫ్‌` టోన్‌. ఆ యూనివర్స్ నుంచి వస్తోన్న సినిమా కావడం. `సలార్‌`..`కేజీఎఫ్‌` సీక్వెల్‌లో భాగంగానే వస్తుండటం ఓ విశేషమైతే, ఇది దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మూవీ కావడం మరో విశేషం. పర్‌ఫెక్ట్ కమర్షియల్‌ ఎలిమెంట్లు, హీరోయిజం, ఎలివేషన్లు, ప్రభాస్‌ ఇమేజ్‌, హీరోయిజం, బలమైన కంటెంట్‌ మేళవింపుగా సినిమాలు తీసి హిట్‌ కొట్టడం ప్రశాంత్‌ నీల్‌కి వెన్నతో పెట్టిన విద్య. `కేజీఎఫ్‌` చిత్రాలతో ఆయన ఆల్రెడీ నిరూపించారు. ఇండియాని షేక్‌ చేశాడు. ఇప్పుడు ఆ జోనర్‌లోనే దానికి కొనసాగింపుగా `సలార్‌`ని తీస్తున్నారు. 

మరోవైపు సినిమాలో మాస్‌ ఎలిమెంట్లు పెద్ద ప్లస్‌ కాబోతున్నాయి. కామన్‌ ఆడియెన్స్‌ నుంచి, ఏ క్లాస్‌ ఆడియెన్స్‌ వరకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్లు ఇందులో ఉన్నాయి. దీనికితోడు యష్‌ గెస్ట్ అప్పియరెన్స్ సినిమా రేంజ్‌ని మార్చేయబోతుంది. `సలార్‌`తో రాఖీబాయ్‌ కలిస్తే వెండితెర రణరంగమనే చెప్పాలి. అదే `సలార్‌`తో చేసి చూపించాలని భావిస్తున్నారు యూనిట్‌. దీనికితోడు వీఎఫ్‌ఎక్స్ కూడా `సలార్‌`కి ప్లస్ కానున్నాయి. హిందీలో వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ అంతగా ఉండవనే కామెంట్ ఉంది. ఇటీవల `పఠాన్‌`లో వీఎఫ్‌ఎక్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కార్టూన్‌ సినిమాని తలపిస్తున్నాయని అన్నారు. కానీ ప్రశాంత్‌ నీల్‌ ఆ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటారు, ఆ క్వాలిటీ మెయింటేన్‌ చేస్తారు. అదే సినిమాకి హైలైట్‌గా నిలిచేలా చేస్తారు. 

దీనికితోడు డార్క్ సెంట్రిక్‌ థీమ్‌ అనేది `సలార్‌`కి కలిసొచ్చే మరో అంశం. ఈ బ్లాక్‌ టోన్‌ కలర్‌ని వాడటం ఇదే ఫస్ట్ టైమ్‌. అది ప్రశాంత్‌ నీల్‌ కి మాత్రమే సాధ్యం. ఇదొక కొత్త ట్రెండ్‌గా నిలిచింది. మాస్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లు, భారీ ఎలివేషన్లు, ప్రభాస్‌ హీరోయిజం `సలార్‌`ని నెక్ట్స్ లెవల్‌`కి తీసుకెళ్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆల్‌రెడీ ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పైగా `బాహుబలి` తర్వాత ప్రభాస్‌కి సరైన సినిమా పడలేదు. పడితే ఎలా ఉంటుందో `సలార్‌` తో నిరూపించేందుకు రెడీ గా ఉన్నారు. ఇలా అన్నింటిని మేళవించి, ఈ ఏడాది సంచలన మూవీ `పఠాన్‌` రికార్డులను కొల్లగొట్టేందుకు ప్రభాస్‌ అస్త్రాలను సిద్దం చేస్తున్నారని చెప్పొచ్చు. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ విలన్‌గా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సెప్టెంబర్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్న `జవాన్‌` కూడా ఈ ఏడాదే రాబోతుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూన్‌ 2న విడుదల కాబోతుంది. మరి `సలార్‌`ని, తన `పఠాన్‌` రికార్డులను `జవాన్‌` బ్రేక్‌ చేస్తుందా? దానికి అంత సీన్‌ ఉందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ చిత్ర దర్శకుడు అట్లీ ఇప్పటి వరకు ఓ మోస్తారు సినిమాలు చేశారు. భారీ స్కేల్‌ ఉన్న చిత్రాలను డీల్‌ చేయలేదు. పైగా మొదటిసారి బాలీవుడ్‌ సినిమా చేస్తున్నారు. అదీ షారూఖ్‌ని డీల్‌ చేస్తున్నాడు. మరి ఏమేరకు మెప్పిస్తారనే ప్రశ్న తలెత్తింది. ప్రశాంత్‌ నీల్‌తో పోల్చితే అట్లీ వెనకబడి పోయే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. ఎలివేషన్లు, యాక్షన్‌ ఎపిసోడ్లు, కలర్‌ పారట్న్, కాస్టింగ్‌ సైతం క్రేజీగా అనిపించే విధంగా లేవు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నా, ఆమె క్రేజ్‌ కొంత వరకే పరిమితం.

మరి `సలార్‌`, `జవాన్‌` తప్ప ఈ ఏడాది పెద్ద సినిమాలు ఏవీ కనిపించడం లేదు. విజయ్‌ `లియో` ఉంది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దీని లెక్క కొంత వరకే పరిమితం. నార్త్ లో విజయ్‌కి అంత ఫాలోయింగ్‌ లేదు.పైగా ఇది ఐదువందల కోట్ల లోపు రేంజ్‌ ఉన్న సినిమానే అవుతుంది, `సలార్‌` రేంజ్‌ కాదని అంటున్నారు. ఇక సల్మాన్‌ చేస్తున్న `కిసి కి భాయ్‌, కిసి కి జాన్‌` చిత్రంపై అంత బజ్‌ రావడం లేదు. పైగా ఆయన వరుస పరాజయాల్లో ఉన్నారు. ఇక `పొన్నియిన్‌ సెల్వన్‌ 2` ఉన్నా అది బిగ్‌ రేంజ్‌లో సత్తా చాటే సినిమాగా కనిపించడం లేదు. మొదటి పార్ట్ నిరాశ పర్చడంతో దీనిపై పెద్దగా ఆశలు లేవు. ప్రభాస్‌ `ఆదిపురుష్‌` ఉన్నా అది ఇప్పటికే వీఎఫ్‌ఎక్స్ విషయంలో విమర్శలెదుర్కొంది. అలా దానిపై కూడా అంచనాలు లేవు. దీంతో `పఠాన్‌` రికార్డులు బ్రేక్‌ చేయడం ప్రభాస్‌కే సాధ్యమని, అందుకు ఆయనకూడా అన్ని రకాలుగా  అస్త్రాలను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు ఫ్యాన్స్. మరి `సలార్‌`ని తట్టుకునే సత్తా, దాన్ని కొట్టే సత్తా `జవాన్‌`కి ఉందా అనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?