Prabhas, Pooja Astrology Pic : జ్యోతిష్యం చూపించుకున్న ప్రభాస్, పూజా హెగ్డే.. ఎందుకో తెలుసా?

Published : Mar 02, 2022, 06:13 PM IST
Prabhas, Pooja Astrology Pic : జ్యోతిష్యం చూపించుకున్న ప్రభాస్, పూజా హెగ్డే.. ఎందుకో తెలుసా?

సారాంశం

పాన్ ఇండి స్టార్ ప్రభాస్ (Prabhas), హీరోయిన్  పూజా హెగ్డే (Pooja Hegde) కలిసి నటించిన చిత్రం‘రాధ్యే శ్యామ్’. వీరిద్దరి నటన అద్భుతంగా ఉండబోతుందంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే   ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, పూజా హెగ్డేలు జ్యోతిష్యం చూపించుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.    

పాన్ ఇండి స్టార్ ప్రభాస్ (Prabhas), హీరోయిన్  పూజా హెగ్డే (Pooja Hegde) కలిసి నటించిన చిత్రం‘రాధ్యే శ్యామ్’(Radhe Shyam). ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ కు ఇంకా గ్యాప్ ఉండటంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన మేకర్స్.. గత నాలుగైదు రోజుల నుంచి వరుస అప్డేట్లతో  ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. మొన్న సాంగ్స్ కు సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేయగా.. ఈ రోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ట్రైలర్ వన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

 ఇక `రాధేశ్యామ్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ముంబయిలోని పీవీఆర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ లో సందడి చేశారు పూజా హెగ్డే, ప్రభాస్‌. ప్రస్తుతం ముంబయి ఈవెంట్‌ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్, పూజా హెగ్దే జ్యోతిష్యం చూయించుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు  ఈవెంట్ లో భాగంగానే దిగినవి. అయితే జ్యోతిష్యం చూపించుకుంటూ ప్రభాస్ తన చేతిని బ్రాహ్మణుడికి చూపించాడు. తన పేరు, నక్షతం, పుట్టిన తేది చెప్పాడు. ముందుగా తన చేతిని చూపించేందుకు ఇబ్బంది పడ్డాడు. కానీ తర్వాత చూపించాడు. ఆ తర్వాత జోత్యిష్యకుడి చేతిని చూసి ‘నీకు చాలా బాగుంది’అంటూ చెప్పాడు. అనంతరం పూజాహెగ్దే తన చేతిని చూపించి జ్యోతిష్యం చూపించుకుంది. తనకు కూడా మున్ముందు భవిష్యత్ చాలా బాగుందని తెలిపారు. 

ఇండియన్‌ బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటి `రాధేశ్యామ్‌`. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు యూనిట్‌. అందులో భాగంగా బుధవారం ముంబయిలో ఈ ఈవెంట్‌ నిర్వహించారు. సినిమాకి కర్టెన్‌ రైజర్‌గా మరో ట్రైలర్‌ని విడుదల చేయగా, ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుంది. సినిమా ప్రధానంగా హస్తజాతకం ఆధారంగా, ప్రభాస్‌ నటించే పాల్మిస్ట్ పాత్ర ప్రధానంగా సాగుతుందని అర్థమవుతుంది. చేయి చూసి వారి జాతకాలు చెబుతూ చుక్కలు చూపిస్తున్నారు ప్రభాస్‌. కానీ ప్రేమ విషయంలో ఆయన చెప్పేది నిజం కాదంటుంది పూజా. మరి ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. ముంబయిలో జరిగిన ఈ ట్రైలర్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డే, దర్శకుడు రాధాకృష్ణకుమార్‌, నిర్మాతలు వంశీ, వక్కీ, భూషణ్‌ కుమార్‌ పాల్గొని మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు