ఫ్రెండ్‌ పార్టీలో ధనుష్‌-ఐశ్వర్య హల్‌చల్‌.. ఇద్దరు మళ్లీ కలిసిపోతారా? వాస్తవమిది..

Published : Mar 02, 2022, 05:38 PM ISTUpdated : Mar 02, 2022, 05:40 PM IST
ఫ్రెండ్‌ పార్టీలో ధనుష్‌-ఐశ్వర్య హల్‌చల్‌.. ఇద్దరు మళ్లీ కలిసిపోతారా? వాస్తవమిది..

సారాంశం

 తాజాగా ధనుష్‌ ఐశ్వర్య లు ఓ పార్టీలో సందడి చేశారు. ఓ కామన్‌ ఫ్రెండ్‌ పార్టీకి వీరిద్దరు హాజరయ్యారు. అయితే ఇందులో ధనుష్‌, ఐశ్వర్య ఇద్దరూ దూరంగానే ఉన్నారు. 

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌(Dhanush).. భార్య ఐశ్వర్య రజనీకాంత్‌(Aishwarya Rajinikanth) విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించి అందరికి షాకిచ్చారు. 18ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్టు పంచుకున్న ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విడిపోవడానికి కారణాలు చెప్పని ఈ జంట తాను కలిసి ఉండలేమని వెల్లడించారు. అయితే వీరిద్దరు విడిపోవడంపై ధనుష్‌ ఫాదర్‌ కస్తూరి రాజా త్వరలో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభిమానులు సైతం అదే కోరుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా Dhanush ఐశ్వర్య లు ఓ పార్టీలో సందడి చేశారు. ఓ కామన్‌ ఫ్రెండ్‌ పార్టీకి వీరిద్దరు హాజరయ్యారు. అయితే ఇందులో ధనుష్‌, ఐశ్వర్య ఇద్దరూ దూరంగానే ఉన్నారు. 18ఏళ్లు కలిసి ఉన్న వీరిద్దరు ఆ పార్టీలో ఒకరికొకరు తెలియదన్నట్టుగా వ్యవహరించారట. కనీసం మాట వరుసకి కూడా మాట్లాడుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీరిద్దరు కలిసి మాట్లాడుకుంటారేమో అని అక్కడి గెస్ట్ లంతా ఆసక్తిగా ఎదురుచూశారట. కానీ వీరిద్దరు దూరంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు అంతకు ముందు ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా  హైదరాబాద్‌కు వచ్చిన ధనుష్‌-ఐశ్వర్యలు ఒకే హోటల్‌లో ఉ‍న్నప్పటికీ కనీసం ఒకరినిఒకరు చూసుకొనే లేదట. వీరిని ఇలా చూసిన వారంతా.. మళ్లీ ఈ ఇద్దరు కలిసిపోతారనే ఆశలు వదిలేసుకున్నట్టు సమాచారం.  

ఐశ్వర్య రజనీకాంత్‌.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు అనే విషయం తెలిసిందే. 2004లో వీరిద్దరి మ్యారేజ్‌ జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఐశ్వర్య దర్శకురాలిగా, ప్లే బ్యాక్‌ సింగర్‌గానూ రాణించారు. ప్రస్తుతం ధనుష్‌ `మారన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈ నెల 11న ఓటీటీలో విడుదల కాబోతుంది. దీంతోపాటు తెలుగు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి `సర్‌`. దీనికి వెంకీ అట్లూరి దర్శకుడు. మరోవైపు శేఖర్‌ కమ్ములతో మరో సినిమా చేస్తున్నారు.  వీటితోపాటు `ది గ్రే మ్యాన్‌` అనే ఇంగ్లీష్‌ సినిమా, `తిరుచిత్రంబలం`, `నానే వరువేన్‌` తమిళ చిత్రాలు చేస్తున్నారు ధనుష్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు